అక్కినేని సమంత టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ హీరోలందరితో సినిమాలు చేసి సక్సెస్ ఫుల్ హీరోయిన్ కొనసాగుతుంది. పెళ్లి తర్వాత సమంత మార్క్ సినిమాలతో ఇప్పటికి దూసుకుపోతుంది. కాకపోతే కథా బలమున్న సినిమాలనే ఎంచుకుంటుంది అక్కినేని వారి కోడలు. ఒకప్పుడు కమర్షియల్ మూవీస్ కి కేరాఫ్ అడ్రెస్ గా ఉన్న సమంత ఇప్పుడు పెరఫార్మెన్స్ ఓరియెంటెడ్ మూవీస్ కె జై కొడుతోంది. ఇక కోలీవుడ్ లోను విజయ్, విజయ్ సేతుపతి, విశాల్ ఇలా అక్కడి స్టార్ హీరోల సినిమాల్లో నటించి సక్సెస్ అయిన సమంత లేటెస్ట్ గా నయనతార - విజయ్ సేతుపతి తో కలిసి విగ్నేష్ శివన్ దర్శకత్వంలో ఓ తమిళ్ మూవీ చేస్తుంది. అలాగే గుణశేఖర్ డైరెక్షన్ లో పాన్ ఇండియా మూవీ గా శాకుంతలం లో నటిస్తుంది. అయితే టాలీవుడ్ లో ఎంత క్రేజ్, ఎంత మర్కెట్ సమంత కి ఉన్నాయో.. కోలీవుడ్ లోనూ సమంత కి అంతే క్రేజ్, అదే మర్కెట్ ఉంది.
అయితే ఇప్పుడు కోలీవుడ్ లో సమంతకి ఎదురు గాలి వీచేలా కనిపిస్తుంది. కారణం ఆమె నటించిన ఫస్ట్ వెబ్ సీరీస్ ఫ్యామిలీ మ్యాన్. కోలీవుడ్ లో ఫ్యామిలీ మ్యాన్ వివాదం జోరందుకుంది. అక్కడి ప్రముఖులు ఫ్యామిలీ మ్యాన్ బ్యాన్ చెయ్యాలని, ఈ వివాదం తో లింకై ఉన్న సమంత క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కోలీవుడ్ ప్రేక్షకులు, సెలబ్రిటీస్ అంతా ఫ్యామిలీ మ్యాన్ కి వ్యతిరేఖంగా నినాదాలు చేస్తే ఓకె.. కానీ సమంత సారి చెప్పాలనే డిమాండ్ చూసాక సమంతకి ఇక కోలీవుడ్ లో ఎదురుగాలే అంటున్నారు. ప్రస్తుతం ఆమె నటించే సినిమాలపై ఈ తమిళ వివాదం ఎఫెక్ట్ పడడం ఖాయమని, నెక్స్ట్ మూవీస్ విషయంలో సమంత కి ఆఫర్స్ రావనే ప్రచారం జరుగుతుంది.