Advertisementt

మోక్షు ఎంట్రీ పై బాలయ్య అదిరే అప్ డేట్

Fri 11th Jun 2021 08:51 AM
balakrishna,balayya birthday interview,aditya 369 sequel,mokshagna debut movie,balayya son mokshgna  మోక్షు ఎంట్రీ పై బాలయ్య అదిరే అప్ డేట్
Balakrishna Latest Interview మోక్షు ఎంట్రీ పై బాలయ్య అదిరే అప్ డేట్
Advertisement
Ads by CJ

బాలయ్య కొడుకు మోక్షజ్ఞ సినీరంగ ప్రవేశంపై బాలకృష్ణ 2018 నుండి చెబుతూనే ఉన్నారు. మోక్షజ్ఞ ని వెండితెరకు పరిచయం చేస్తాను.. సమయం చూసుకుని అది ఈ ఏడాదైనా, వచ్చే ఏడాదైనా ఉండొచ్చని అంటున్నారు. ఈ పుట్టిన రోజుకైనా మోక్షజ్ఞ సైలర్ స్క్రీన్ ఎంట్రీ పై బాలయ్య ఓ క్లారిటీ ఇస్తే బావుండు అని ఫాన్స్ ఎదురు చూసారు. అయితే బాలయ్య తన బర్త్ డే కి ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మోక్షజ్ఞ వెండి తెర ఎంట్రీ పై ఫుల్ క్లారిటీ ఇచ్చేసారు. అంతేకాదు.. బాలకృష్ణ తన కొడుకు మోక్షజ్ఞతో కలిసి నటిస్తామని.. అలా నటిస్తేనే మోక్షజ్ఞ నటనలో మరిన్ని మెళుకువలు నేర్చుకోగలుగుతాడని, గతంలో తన తండ్రి సినిమాల్లో తాను నటించి నటనలో మెళుకువలు నేర్చుకున్నానని చెబుతున్నారాయన.

బాలయ్య కి మంచి పేరు తెచ్చిన ఆదిత్య 369 సీక్వెల్ గురించి మాట్లాడుతూ.. తప్పకుండా ఈ సినిమా ఉంటుందని, ఆ సినిమాలో తాను తన కొడుకు మోక్షజ్ఞ కలిసి నటిస్తామంటూ చెప్పి ఫాన్స్ ని సర్ప్రైజ్ చేసారు. తన అనుభవాన్ని రంగరించి నటనలో తన కొడుక్కి మెళుకువలు నేర్పిస్తాను అని, ఆదిత్య 369 సీక్వెల్ కథని తానే స్వయంగా రాస్తున్నాను అని చెప్పి మరింత సర్ప్రైజ్ చేసారు బాలయ్య. ఆ కథని విన్న ఆదిత్య 369 దర్శకుడు సింగీతం ఈ కథను మొదటి భాగానికి దర్శకత్వం వహించిన దర్శకుడిగా తాను కానీ, లేదంటే స్వయంగా బాలకృష్ణ కానీ దర్శకత్వం చేస్తే న్యాయం చేయగలరని, వేరే దర్శకులకు ఈ కథను అప్పగించ వద్దని సింగీతం చెప్పినట్లుగా బాలయ్య చెబుతున్నారు. మరి మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ ఈ ఆదిత్య 369 సీక్వెల్ అయ్యుంటుందా అనే ఆలోచనలో ఇప్పుడు బాలయ్య ఫాన్స్ ఉన్నారు.

Balakrishna Latest Interview:

Balakrishna confirms Aditya 369 sequel will mark Mokshagna debut

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ