బాలకృష్ణ - గోపీచంద్ మలినేని - మైత్రి మూవీ మేకర్స్ కాంబో మూవీ ఫిక్స్ అవడమే కాదు.. నిన్న బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈ సినిమాకి ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఫిక్స్ అయ్యాడు. ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ వెళ్లబోతుంది. అందుకే దర్శకుడు గోపీచంద్ బాలయ్య కోసం పవర్ ఫుల్ విలన్ తో పాటుగా, కీలక నటుల ఎంపిక చేపట్టాడు. అందులో భాగంగా ఈ సినిమాలో లేడి విలన్ గా తనకి క్రాక్ లో కలిసొచ్చిన జయమ్మ అదేనండి వరలక్ష్మి శరత్ కుమార్ ని ఎంపిక చేసినట్లుగా ప్రకటించారు. క్రాక్ సినిమాలో సముద్రఖని ప్రియురాలిగా, జయమ్మ కేరెక్టర్ లో విలనిజాన్ని పండించిన వరు శరత్ కుమార్ ఈ సినిమాలో పవర్ ఫుల్ కేరెక్టర్ చెయ్యబోతుందట.
వాస్తవ సంఘటనలను ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలకృష్ణ గర్జించే సింహంలా పవర్ ఫుల్ మాస్ లుక్‌లో కనిపిస్తుండగా..ఇప్పుడు వరలక్ష్మి శరత్ కూడా మరో పవర్ ఫుల్ రోల్ లో కనిపించబోతుంది. క్రాక్ సినిమా అనంతరం నాకెంతో ఇష్టమైన దర్శకుడు గోపీచంద్ మలినేనితో కలిసి.. బాలయ్య సినిమా కోసం పనిచేయడం ఆనందంగా ఉంది. ఎంత త్వరగా సెట్‌లోకి అడుగు పెడదామా అని ఎదురుచూస్తున్నాను అంటూ వారు శరత్ కుమార్ ట్వీట్ చేసింది. మరి వరలక్ష్మి ఎలాంటి రోల్ లో బాలయ్యతో ఢీ కొట్టబోతుందో అంటూ బాలయ్య ఫాన్స్ క్యూరియాసిటిలో ఉన్నారు.