Advertisementt

అలియా భట్ స్పీడు

Fri 11th Jun 2021 03:01 PM
alia bhatt,rrr pan india movie,sanjay leela bhansali,gangubai kathiawadi,garba song  అలియా భట్ స్పీడు
Alia Bhatt to resume shoot with Sanjay Leela Bhansali అలియా భట్ స్పీడు
Advertisement
Ads by CJ

కరోనా సెకండ్ వెవ్ వచ్చిరాగానే చాలా సినిమా షూటింగ్స్ వాయిదాలు పడ్డాయి. అలాగే సెలబ్రేటిస్ కూడా కరోనా బారిన పడడంతో చాలా సినిమాల షూటింగ్స్ ఆపెయ్యాల్సి వచ్చింది. అలా ఆపిన వాటిలో అలియా భట్ నటిస్తున్న సినిమాలు ఉన్నాయి. ముందు రణబీర్ కపూర్ కరోనా బారిన పడగా, తర్వాత అలియా భట్ కరోనా బారిన పడి హోమ్ ఐసోలేషన్ లోనే ట్రీట్మెంట్ తీసుకుంది. తర్వాత సెకండ్ వేవ్ రావడంతో సినిమా షూటింగ్స్ బంద్ అయ్యాయి. ఇక ప్రస్తుతం లాక్ డౌన్ ముగిసి అన్ని నార్మల్ గా అవుతున్నాయి. మహారాష్ట్ర, తెలంగాణ, ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో అన్ లాక్ ప్రక్రియ మొదలు కావడంతో సినిమా ఇండస్ట్రీ కూడా ముందుకు కదులుతుంది. అందులో ముందుగా అలియా భట్ జోరు చూపిస్తుంది.

అలియా భట్ ఆర్.ఆర్.ఆర్ పాన్ ఇండియా మూవీ తో పాటుగా బాలీవుడ్ లో గంగూభాయ్ కతీయవాది, అలాగే బ్రహ్మాస్త్ర  లాంటి భారీ బడ్జెట్ మూవీస్ లో నటిస్తుంది. దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీకి కరోనా సోకడంతో వాయిదా పడిన గంగూభాయ్ కతీయవాది మూవీ రెస్యూమ్ షూట్ కోసం టీమ్ సమాయత్తమవుతోంది. అందులో భాగంగానే అలియా భట్ సంజయ్ లీలా భన్సాలీ ఆఫీస్ కి కూడా వెళ్ళింది. అలియా భట్ సంజయ్ లీలా భన్సాలీతో చర్చించి.. షూటింగ్ కోసం రెడీ కాబోతుంది. ఇక మరోపక్క ఆర్.ఆర్.ఆర్ లోనూ అలియా భట్ పార్ట్ షూటింగ్ ఫినిష్ అయ్యింది. అటు ఆమె నటించిన మరో బిగ్ మూవీ బ్రహ్మాస్త్ర రిలీజ్ కి రెడీ అవుతుంది. 

ఇక గంగూభాయ్ కతీయవాది సాంగ్ షూట్ అండ్ మిగతా షూటింగ్ కొద్దిమేర బ్యాలెన్స్ ఉండడంతో అలియా భట్ ముందు ఆ షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో పడింది.

Alia Bhatt to resume shoot with Sanjay Leela Bhansali:

Alia Bhatt to resume shoot for Sanjay Leela Bhansali Gangubai Kathiawadi with garba song

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ