రోజా అటు పొలిటికల్ గాను, ఇటు జబర్దస్త్ ప్రోగ్రాం తోనే కాదు.. జెమినీ టివిలో రచ్చ బండ కార్యక్రమంలో బిజీ అవుతుంది. నిన్నమొన్నటివరకు అనారోగ్య కారణాలతో రెస్ట్ లో ఉన్న రోజా.. మళ్ళీ యాక్టీవ్ గా మారింది. జబర్దస్త్ లో రీ ఎంట్రీ ఇచ్చిన రోజా ఇంద్రజ స్థానంలో గురువారం, శుక్రవారం జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ లోకి జెడ్జ్ గా వచ్చేసింది. అలాగే రాజకీయాల్లో ప్రతిపక్షానికి ముచ్చెమటలు పట్టిస్తుంది. అయితే జబర్దస్త్ లో రోజా యాంకర్ అనసూయ, రష్మీ లకు పోటీ గా మంచి కాస్ట్యూమ్స్ తో అదరగొట్టేస్తుంది. ఈ మధ్యన సోషల్ మీడియాలో ఫోటో షూట్స్ తో అదరగొట్టేస్తుంది. అయితే తాజాగా రోజా నెటిజెన్స్ చేతిలో అడ్డంగా బుక్ అయ్యింది.
తాజాగా రోజా డ్రస్ చూసి తెగ ట్రోలింగ్ చేస్తున్నారు నెటిజనులు. నైటీ లాంటి డ్రెస్సుతో రోజా ఈ రోజు శుక్రవారం రాబోయే జబర్దస్త్ లో కనిపించేసరికి నెటిజెన్స్ రోజాని తెగ ట్రోల్ చెయ్యడమే కాదు.. మీమ్స్ మీద మీమ్స్ రోజా డ్రెస్సు మీద పడుతున్నాయి. రోజా కి టైం లేక నైటీ తో వచ్చేసింది.. ఓకె వదిలెయ్యండి అని కొందరంటుంటే.. పాపం రోజా గారికి పొలిటికల్ మీటింగ్స్, ఇటు షూటింగ్స్ అస్సలు తీరికే లేక ఇలా వచ్చేసిందిరా అంటున్నారు ఇంకొందరు. పాపం ఏమైనా రోజా డ్రెస్సు ఆమెని ఇలా నెటిజెన్స్ కి నోటికి పని చెప్పేలా చెప్పింది.