కరోనా వ్యాక్సిన్స్ లో అంటే కోవిషీల్డ్ వచ్చిన కొత్తల్లో 40 నుండి 45 రోజుల్లోపు ఫస్ట్ డోస్ కి సెకండ్ డోస్ కి సమయం ఉండాలని చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు మాత్రం ఆ సమయాన్ని 80 నుండి 85 రోజులకి పెంచేసింది. కరోనా వ్యాక్సిన్ లో కోవిషీల్డ్, కోవ్యాగ్జిన్ ల ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ ల సమయాన్ని కరోనా వ్యాక్సిన్ కొరత వలన సృష్టించిందే కానీ ఫస్ట్ డోస్ కి సెకండ్ డోస్ కి మధ్యన అంత ఎక్కువ సమయం ఉండకూడదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. అదే మాట అమెరికా అంటువ్యాధుల నివారణ నిపుణులు ఆంటోనీ ఫౌచీ చెబుతున్నారు. అలా డోస్ కో డోస్ కి సమయాన్ని పెంచడం వలన కొత్త వేరియెంట్స్ సోకె ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయపడుతున్నారు.
ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్లు అయినా ఫైజర్ వ్యాక్సిన్ అయినా మూడు వారాలు, మోడెర్నాకు నాలుగు వారాల వ్యవధి ఉందన్నారు. ఒక వేళ ఆ మధ్యలోని సమయాన్ని పెంచితే కొత్త వేరియెంట్స్ బారిన పడే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు ఆంటోనీ ఫౌచీ. మరి ఇండియా లో కోవిషీల్డ్ గతంలో డోస్ కి డోస్ మధ్యన 45 డేస్ ఉంటే.. ఇప్పుడు 85 డేస్ చేసారు. కొవిషీల్డ్ రెండు డోసుల మధ్య వ్యవధిని పొడిగించినప్పటికీ.. దాని వలన వైరస్‌తో పోరాడే సామర్థ్యం విషయంలో పెద్దగా తేడా ఏమీ ఉండదని.. ఆరోగ్య నిపుణులు చెప్పడంతోనే కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా నిర్ణయం తీసుకుంది.