కెరీర్ తొలినాళ్లలో విలన్ గా స్టార్ హీరోలైన ప్రభాస్, మహేష్ బాబులతో తలపడి సక్సెస్ అందుకున్న గోపీచంద్ తర్వాత మాస్ హీరోగా మారాడు. కొన్నాళ్లుగా సరైన సక్సెస్ లేని గోపిచంద్ తాజాగా సంపత్ నంది కాంబోలో సీటిమార్ మూవీ షూటింగ్ ఫినిష్ చేసి రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నాడు. మిల్కి బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఏప్రిల్ లోనే విడుదల కావాల్సి ఉండగా.. కొన్ని కారణాల వలన సినిమా పోస్ట్ పోన్ అయ్యింది. ఇక థియేటర్స్ ఓపెన్ కాగానే సీటిమార్ రిలీజ్ డేట్ ప్రకటించడానికి టీం రెడీగా ఉంది. గోపిచంద్ పుట్టిన రోజుకి సీటిమార్ నుండి స్పెషల్ పోస్టర్ వదిలింది టీం.
దర్శకుడి మారుతీ తో కలిసి పక్కా కమర్షియల్ మూవీ చేస్తున్నాడు గోపీచంద్. రాశి ఖన్నా హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో గోపీచంద్ చాలా స్టయిల్ గా కనిపిస్తున్నాడు. గోపీచంద్ బర్త్ డే స్పెషల్ గా ఒక రోజు ముందే కమర్షియల్ టీం పక్కా కమర్షియల్ నుండి స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేసింది. మరి ఈ ఏడాది ఈ రెండు సినిమాలతో గొలిపిచంద్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నేడు గోపీచంద్ పుట్టిన రోజు కావడంతో ఆయనకు సోషల్ మీడియాలో పలువురు సినీప్రముఖులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరి గోపీచంద్ కి సినీజోష్ టీం తరుపున ఏ వెరీ హ్యాపీ బర్త్ డే.