బాలకృష్ణ ప్రస్తుతం అఖండ మూవీ షూటింగ్ ఎప్పుడెప్పుడు పూర్తి చేద్దామా అని వెయిట్ చేస్తున్నాడు. కరోనా సెకండ్ వేవ్ లేకపోతే అఖండ షూటింగ్ అవ్వడమేమిటి.. ఈపాటికి సినిమా థియేటర్స్ లోకి వచ్చేసేది. ఇక అఖండ షూటింగ్ ఫినిష్ అవ్వగానే ఆయన పుట్టిన రోజునాడు మైత్రి మూవీ మేకర్స్ లో గోపీచంద్ మలినేని తో మాస్ ఎంటర్టైనర్ చేయబోతున్నట్లుగా ప్రకటించారు. బాలయ్య కి ఆ సినిమాలో అప్పుడే లేడీ విలన్ కూడా ఫిక్స్ అయ్యింది. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ ని ఎంపిక చేసి ప్రకటన కూడా ఇచ్చారు. ఆ తర్వాత బాలయ్య ని అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయబోతున్నాడనే న్యూస్ ఉంది.
న్యూస్ మాత్రమే కాదు.. అనిల్ రావిపూడి కూడా బాలయ్య తో మూవీ ని కన్ ఫర్మ్ చేసాడు. బాలయ్య బాబు తో ఓ సినిమా చేయబోతున్నట్లుగా చెప్పాడు. కానీ బాలకృష్ణ తన పుట్టిన రోజున ఇచ్చిన ఛానల్ ఇంటర్వ్యూలో గోపీచంద్ మలినేని తర్వాత చెయ్యబోయే చిత్రంపై ఎక్కడా స్పష్టతనివ్వలేదు. అంటే బాలయ్య అనిల్ రావిపూడి సినిమా జస్ట్ గాసిప్ గా మిగిలిపోతుందా ఏమిటి.. అందుకే బాలయ్య అనిల్ రావిపూడి సినిమాపై విషయం స్పందించలేదు అని అనుకుంటున్నారు. అయితే తాజాగా ఆ రూమర్స్ కి చెక్ పెడుతూ అభిమానులతో జూమ్ మీట్ నిర్వహించిన బాలకృష్ణ.. అనిల్ రావిపూడి సినిమాపై క్లారిటీ ఇచ్చాడు. త్వరలో అనిల్ రావిపూడితో తన సినిమా ఉండనుందనే విషయాన్ని ఆ జూమ్ మీట్ లో బాలయ్య స్పష్టం చేశారు.
ఈ ప్రాజెక్టు లైన్లోనే ఉందనే విషయాన్ని కాస్త గట్టిగానే చెప్పారు. దానితో బాలయ్య అభిమానులు ఖుషి అయ్యారు. వరసగా హిట్ డైరెక్టర్స్ తో బాలయ్య కమిట్ అయ్యి హిట్ కొట్టడం పక్కా అంటున్నారు వాళ్ళు.