బాలీవుడ్ లో చాలా త్వరగా స్టార్ డం సంపాదించుకుని.. ప్రస్తుతం దీపికా పదుకొనే, ప్రియాంక చోప్రా ల తర్వాత అంతటి ఫామ్ లో ఉన్న క్రేజీ గర్ల్ అలియా భట్.. అందాలు ఆరబొయ్యడానికి, బికినీ వెయ్యడానికి ఎలాంటి మొహమాటం చూపదు. బీచ్ ల వెంట, బాయ్ ఫ్రెండ్ రణబీర్ కపూర్ తో ఎంజాయ్ చేసే అలియా భట్ ప్రస్తుతం భారీ బడ్జెట్ మూవీస్ తో తెగ క్రేజ్ సంపాదించింది. తెలుగు దర్శకుడు రాజమౌళి తెరకెక్కించే ఆర్.ఆర్.ఆర్ లో అలియా భట్ సీత గా కనిపించేది కొద్దిసేపే అయినా అలియా భట్ సినిమాకే కీలకం అని చెప్పడంతో ఇప్పుడు ఆమె పాత్రపై అంచనాలు పెరిగిపోయాయి.
ఇక బ్రహ్మాస్త్ర, గంగూభాయ్ కతీయవాది సినిమాల విషయంలో మరింతగా క్రేజ్ ఉంది. అయితే అలియా భట్ చిన్నప్పుడు చాలా బబ్లీ గా ఉండేదట. సినిమాల్లో హీరోయిన్ అవుదామనుకున్న టైం లోనే అలియా బాగా బరువు తగ్గి హీరోయిన్ గా క్రేజీగా మరిందనేది తెలిసిన విషయమే. అలియా భట్ చిన్నప్పుడు అప్పుడప్పుడు తన తండ్రి మహేష్ భట్ తెరకెక్కించే సినిమా షూటింగ్స్ కి వెళ్ళేది. అలా ఎవరైనా షూటింగ్స్ కి వెళ్తే సినిమాలో హీరో-హీరోయిన్స్ షూటింగ్ ఎలా చేస్తారో చూడడానికి వెళతారు. కానీ అలియా భట్ మాత్రం షూటింగ్స్ సెట్స్ కి తినడానికి వెళ్లేదట. షూటింగ్ దగ్గర అయితే చాలా రకాల తినే ఐటమ్స్ ఉంటాయని, ఎంచక్కా వాటన్నింటినీ తినేయొచ్చనేది అప్పట్లో ఆలియా ఉద్దేశం అట. తినే విషయంలో ఆలియా మొహమాటపడదని అప్పట్లో ఆమె బరువు చూస్తేనే అర్ధమవుతుంది.