Advertisementt

ఫైనల్ షెడ్యూల్ బిగిన్ అంటున్న హీరో

Mon 14th Jun 2021 11:01 AM
nithin maestro movie,nithin,maestro movie,maestro movie final schedule,maestro movie shooting in hyd  ఫైనల్ షెడ్యూల్ బిగిన్ అంటున్న హీరో
Nithin Maestro final Schedule Started ఫైనల్ షెడ్యూల్ బిగిన్ అంటున్న హీరో
Advertisement
Ads by CJ

సెకండ్ వెవ్ లాక్ డౌన్ తో సినిమా షూటింగ్స్ మొత్తం షెడ్డుకెళ్ళిపోయాయి. గత నెల రోజులుగా అన్ని సినిమాల షూటింగ్స్ లాక్ డౌన్ వలన ఆగిపోయాయి. ప్రస్తుతం తెలంగాణాలో ఉదయం 6 నుండి సాయంత్రం 6 వరకు లాక్ డౌన్ సడలింపులు ఉండడంతో చిత్ర పరిశ్రమ మొత్తం సినిమా షూటింగ్స్ కి సమాయత్తమవుతున్నాయి. అందులో అందరికన్నా ముందుగా హీరో నితిన్ షూటింగ్ మొదలు పెట్టేసాడు. ఈ ఏడాది సినిమా థియేటర్స్ ఫుల్ అక్యుపెన్సీతో ఓపెన్ అయిన వెంటనే చెక్ మూవీ ని, అలాగే మార్చి లో రంగ్ దే మూవీ తో సందడి చేసిన నితిన్.. ఇప్పుడు మేస్ట్రో మూవీ కోసం రెడీ అయ్యాడు. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన అంధధూన్ మూవీ ని రీమేక్ చేస్తున్నాడు. నితిన్ ఇందులో అంధుడిగా కనిపించబోతున్నాడు. 

ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరిలోనే మొదలైంది. తమన్నా బోల్డ్ పాత్రలో విలన్ గా నటిస్తున్న ఈసినిమాలో నభ నటేష్ హీరోయిన్ గా నటిస్తుంది. కరోనా సెకండ్ వేవ్ ముగియడంతో నితిన్ మేస్ట్రో మూవీ షూటింగ్ మొదలు పెట్టబోతున్నట్టుగా ప్రకటించాడు. అందులోనూ ఫైనల్ షెడ్యూల్ అంటూ ట్విస్ట్ ఇచ్చాడు. దాదాపుగా షూటింగ్ చాలా వరకు పూర్తయ్యింది అని, ఇప్పుడు ఫైనల్ షెడ్యూల్ మేస్ట్రో మూవీ చిత్రీకరణని నేడు హైదరాబాద్ లో మొదలు పెట్టబోతున్నట్టుగా నితిన్ లుక్ తో పాటుగా ప్రకటించింది టీం. ఈ సినిమా తర్వాత నితిన్ పవర్ పేట అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తాడు.

Nithin Maestro final Schedule Started:

Nithin Maestro Movie final Schedule shooting Started in Hyderabad 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ