Advertisementt

బ్లడ్ డొనేట్ చేసిన మెగాస్టార్ దంపతులు

Mon 14th Jun 2021 01:22 PM
chiranjeevi,chiru wife surekha,blood donate,chiranjeevi blood band,corona  బ్లడ్ డొనేట్ చేసిన మెగాస్టార్ దంపతులు
Chiru and his wife donated blood బ్లడ్ డొనేట్ చేసిన మెగాస్టార్ దంపతులు
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరు హైదరాబాద్ లో బ్లడ్ బ్యాంక్ ఓపెన్ చేసి సకాలంలో బ్లడ్ దొరక్క చనిపోయే వారికీ చిరు బ్లడ్ బ్యాండ్ ద్వారా బ్లడ్ పంపిస్తూ ఎప్పటినుండో సహాయం చేస్తున్న విషయం తెలిసిందే. మెగా ఫాన్స్ బ్లడ్ డొనెర్స్ గా చిరంజీవి బ్లడ్ బ్యాంకు కి వచ్చి స్వచ్ఛందంగా బ్లడ్ డొనేట్ చేస్తుంటారు. అలాగే మెగా హీరోల పుట్టిన రోజు సందర్భంగా సెలబ్రిటీస్, అలాగే మెగా ఫ్యామిలీ మెంబెర్స్, మెగా ఫాన్స్ బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని చేపడుతుంటారు. తాజాగా వరల్డ్ బ్లడ్ దొనొర్స్ డే సందర్భంగా మెగాస్టా చిరు ఆయన భార్య సురేఖ తో కలిసి చిరంజీవి బ్లడ్ బ్యాంకు కి వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేసారు. 

చిరు - సురేఖ బ్లడ్ డొనేట్ చేస్తున్న ఫోటో ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. బ్లడ్ డొనేట్ చేసేవారికి కృతజ్ఞతలు తెలియజేసారు మెగాస్టార్ చిరు. ఇలా బ్లడ్ డొనేట్ చెయ్యడం వలన చాలామందిని ఆపద నుండి కాపాడవచ్చని చెప్పారు. ఇక రీసెంట్ గా చిరంజీవి - రామ్ చరణ్ కలిసి కరోనా పేషేంట్స్ కి ఆవరసమైన చిరు ఆక్సిజెన్ బ్యాంక్స్ ని రెండు తెలుగు రాష్ట్రాల్లో జిల్లాల వారీగా ఏర్పాటు చెయ్యడమే కాదు. చిరంజీవి బ్లడ్ బ్యాంకు లో సినీ కార్మికులకు కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించారు. సొంత ఖర్చుతో చిరు ఇండస్ట్రీ తరుపున ఇన్ని మంచి పనులు చేస్తుండడంతో ఆయన ఫాన్స్ చిరు పై మరింత అభిమానం పెంచేసుకుంటున్నారు.

Chiru and his wife donated blood:

Chiru and his wife Surekha donated blood

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ