Advertisementt

హైకోర్టు తీర్పుపై రాజు గారి రియాక్షన్

Mon 14th Jun 2021 08:06 PM
ashok gajapathi raju,first reaction,high court,verdict,mansaas trust  హైకోర్టు తీర్పుపై రాజు గారి రియాక్షన్
Ashok Gajapathi Raju Reaction On High Court Verdict On Mansaas Trust హైకోర్టు తీర్పుపై రాజు గారి రియాక్షన్
Advertisement
Ads by CJ

మాన్సాస్ ట్రస్టు కేసులో సంచయిత నియామకం రద్దు, ట్రస్టు చైర్మన్ గా.. మాన్సాస్ ట్రస్టు, సింహాచలం దేవాలయ ట్రస్టు బోర్డు చైర్మన్ గా తన పునర్నియామకంపై హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు స్పందించారు. అశోక్ గజపతిరాజు స్పందించారు. దేశంలో చట్టాలున్నాయని ఈ కేసుతో మరోసారి రుజువైంది అని అన్నారు అశోక్ గజపతిరాజు. రాజ్యాంగాన్ని గౌరవించడం నేర్చుకోవాలన్న అశోక్ గజపతి తాను ట్రస్టు చైర్మన్ గా వ్యవహరించిన సమయంలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేశారని, అక్రమాలు నిజంగానే జరిగుంటే ఇప్పటివరకు ఎందుకు నిరూపించలేకపోయారని ప్రశ్నించారు. 

తనపై కక్షతో మాన్సాస్ ట్రస్టు ఉద్యోగులను పలు ఇబ్బందులకు గురిచేశారని, ఈ క్రమంలోనే మాన్సాస్ ట్రస్టు కార్యాలయాన్ని మరోచోటికి తరలించారని వెల్లడించారు. ఆఖరికి మూగజీవాలను కూడా హింసించారని, రాక్షసులు కూడా ఇలా చేసివుండరని ఆయన వ్యాఖ్యానించారు. ఇకనైనా చట్టాలను, రాజ్యాంగాన్ని గౌరవించడం నేర్చుకోవాలని హితవు పలికారు. తీర్పు ఉత్తర్వులు అందాక మిగతా వివరాలు అందిస్తానని తెలిపారు.

Ashok Gajapathi Raju Reaction On High Court Verdict On Mansaas Trust:

Ashok Gajapathi Raju First Reaction On High Court Verdict On Mansaas Trust

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ