లాక్ డౌన్ తో సినిమా షూటింగ్స్ అన్ని క్యాన్సిల్ అయ్యాయి. కరోనా పాండమిక్ సిట్యువేషన్ లో గడప దాటడానికి కూడా జనాలు భయపడ్డారు. కరోనా సెకండ్ వేవ్ ప్రజలని, సెలబ్రిటీస్ ని ఒణికించేసింది. ఇక ఇంట్లోనే ఉన్న చాలామంది రొటీన్ లో పడిపోతే.. సెలబ్రిటీస్ కొంతమంది కొత్త లుక్స్ ట్రై చేసారు. అందులో టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య మేకోవర్ మాములుగా లేదు. ప్రస్తుతం స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న లక్ష్య తో పాటుగా.. రీతూ వర్మ తో కలిసి వరుడు కావలెను లవ్ స్టోరీ లో నటిస్తున్న నాగ శౌర్య చేతిలో నాలుగు సినిమాలున్నాయి. మొన్నామధ్యన లక్ష్య టీజర్ లోనూ, సోషల్ మీడియాలోనూ సిక్స్ ప్యాక్ లుక్ తో షాక్ ఇచ్చిన నాగ శౌర్య.. ఇప్పుడు మరింతగా మేకోవర్ అయ్యాడు.
నాగ శౌర్య జిమ్ బాడీ చూస్తే కేకో కేక అనాల్సిందే. ఈ లుక్ కోసం నాగ శౌర్య కష్టాన్ని తలుచుకుంటే బాబోయ్ అనేస్తారు. అంతలాంటి మేకోవర్ తో నాగ శౌర్య కొత్త లుక్ ని సోషల్ మీడియాలో షేర్ చేసాడు. లక్ష్య సినిమా కోసమే నాగ శౌర్య జిమ్ బాడీ ని డెవెలప్ చేసాడు. కానీ ఈ లాక్ డౌన్ లో ఆ జిమ్ లో వర్కౌట్స్ తో కండలు తిరిగిన దేహంతో.. జిమ్ లో డంబుల్స్ మధ్యన అలా చూస్తే అమ్మో శౌర్య మరింతగా రాటు తేలాడురా అంటారు. ప్రస్తుతం నాగ శౌర్య కొత్త మేకోవర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.