మహేష్ బాబు - పరశురామ్ కాంబోలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట అన్ని సినిమాల షూటింగ్స్ వలే.. కరోనా సెకండ్ వేవ్ తో వాయిదా పడింది. మహేష్ బాబు రఫ్ గా కనిపించబోతున్న ఈ సినిమా బ్యాంకింగ్ వ్యవస్థలోని లోపాలను, బ్యాంకు లకు అప్పులు ఎగ్గొట్టి విదేశాలకు చెక్కేసిన బడా బాబుల మీద తెరకెక్కుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తుంది. త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తుంది టీం. మహేష్ కూడా అక్టోబర్ కల్లా షూటింగ్ కంప్లీట్ చేసేసి త్రివిక్రమ్ మూవీ కోసం రెడీ అవ్వాలని చూస్తున్నాడు.
అయితే సర్కారు వారి పాట పై మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అంచనాలు పెంచేసాడు. అలా వైవుకుంఠపురములో లాంటి బ్లాక్ బస్టర్ తో ఉన్న థమన్ సర్కారు వారి పాటకు పనిచెయ్యడంతో.. సినిమాపై అందరిలో అంచనాలు పెరిగాయి. తాజాగా థమన్ సర్కారు వారి పాట మ్యూజిక్ గురించి మట్లాడుతూ.. ఈ సినిమాలోని పాటల కోసం ఇచ్చిన మ్యూజిక్ మహేష్ ఫాన్స్ లో జోష్ పెంచడం ఖాయం. ఈ సినిమా బ్యాగ్ రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయేలా వచ్చింది. బ్యాగ్ రౌండ్ స్కోర్ సినిమాకి హైలెట్ గా నిలుస్తుంది అనడంలో అనుమానాలక్కర్లేదు అంటూ.. ఈ సినిమా పెద్ద హిట్ అవడం ఖాయమని తేల్చేసాడు ఎస్ ఎస్ థమన్. థమన్ భరోసాతో మహేష్ ఫాన్స్ కి పూనకలొచ్చేస్తున్నాయి.