Advertisementt

కరోనా తో చనిపోతే.. జబర్దస్త్ కమెడియన్

Wed 16th Jun 2021 04:55 PM
jabardasth abhi,adhire abhi,difficulties with corona,covid 19  కరోనా తో చనిపోతే.. జబర్దస్త్ కమెడియన్
Jabardasth Abhi difficulties with Corona కరోనా తో చనిపోతే.. జబర్దస్త్ కమెడియన్
Advertisement
Ads by CJ

కరోనా సెకండ్ వేవ్ ప్రజలని భయ భ్రాంతులకి గురి చేసింది. అనేకమంది కోవిడ్ సెకండ్ వేవ్ వలన ప్రాణాలు కోల్పోయారు. పలువురు సెలబ్రిటీస్ కూడా కరోనా బారిన పడ్డారు. సినిమా ఆర్టిస్ట్ లు, బుల్లితెర ఆర్టిస్ట్ లు ఇలా చాలామంది కరోనా బారిన పడి కోలుకున్న వారు ఉన్నారు. ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు. కరోనా బారిన పడి ఓకే గదిలో స్వీయ నిర్బంధంలో ఉండి చికిత్స తీసుకుని కోలుకుని బయటపడినవారు ఉన్నారు. అయితే తాజాగా ఓ జబర్దస్త్ కమెడియన్ కరోనా బారిన పడి చాలా కష్టాన్ని అనుభవించినట్లుగా  రీసెంట్ గా ఓ షో లో చెప్పాడు. అతను.. జబర్దస్త్ అదిరే అభి.

అదిరే అభి అందరిలాగే కోవిడ్ బారిన పడి ఓ గదిలో తనని తాను నిర్బందించుకుని.. కరోనా నుండి కోలుకున్నట్లుగా చెప్పాడు. అందులో వినడానికి వింతేమీ లేదు. కానీ అభి చాలా దారుణమైన అనుభవాన్ని కరోనా నుండి ఎదుర్కొన్నాడట. అది తనకి రూమ్ లో ఉన్నప్పుడు ఏదైనా అయ్యి.. ఒకవేళ జరగకూడనిది జరిగితే అనే భయంతో డోర్ కి కనీసం గడి కూడా పెట్టలేదట. ఒకవేళ ఏదైనా జరిగి గడి తియ్యలేకపోతే తన ఫ్యామిలీ తనని చూడడానికి చాలా సమయం పడుతుంది అనే ఆలోచనలో అలా తలుపుకి గడి పెట్టలేదు అని.. తాను కరోనా వలన పడిన క్షోభని సుమ యాంకరింగ్ లో శనివారం వస్తున్న క్యాష్ ప్రోగ్రాం లో రివీల్ చేసాడు. కరోనా అనేది మనుషులని ఎంతగా భాద, భయ పెట్టిందో ఇలాంటి సన్నివేశాలు కోకొల్లలు.

Jabardasth Abhi difficulties with Corona:

Jabardasth Abhi says about his difficulties with corona

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ