బిగ్ బాస్ సీజన్ 5 ఇదిగో అదిగో అనడమే కానీ.. అసలు స్టార్ మా లో సీజన్ 5 ఎపుడు మొదలవుతుందో ఒక క్లారిటీ లేదు. నిన్నటివరకు జులై నుండి బిగ్ బాస్ 5 మొదలవుతుంది అంటే.. ఈ రోజు కొన్ని కారణాల వల్ల అది సెప్టెంబర్ కి పోస్ట్ పోన్ అయినట్లుగా వార్తలొస్తున్నాయి. ఇక ఈ షో లోకి అడుగుపెట్టబోయే సెలబ్రిటీస్ గురించి సోషల్ మీడియాలో అప్పుడే రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బిగ్ బాస్ సీజన్ 5 అనుకున్నప్పటినుండి టివి 9 నుండి ఓ యాంకర్, అలాగే ఢీ వర్షిణి, జబర్దస్త్ వర్ష, యాంకర్ రవి పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. ఆఫర్స్ లేని కొంతమంది హీరోయిన్స్ ని తీసుకోవడానికి ప్రయత్నించినా వారు ఒప్పుకోలేదని.. దానితో వాళ్ళని స్టార్ మా లైట్ తీసుకుంది అని అంటున్నారు.
ఇప్పుడు అందులో నుండి టివి 9 యాంకర్ ప్రత్యూష పేరు.. బిగ్‌బాస్ ఎంపిక రేసులో ఎక్కువగా వినిపిస్తుంది. టివి 9 యాంకర్ ప్రత్యుష ఆల్మోస్ట్ బిగ్ బాస్ కి ఎంపికైపోయినట్లుగా సోషల్ మీడియాలో పదే పదే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రత్యూష స్క్రీన్ ప్రెజెన్స్ దగ్గరనుండి ఆమె వాక్చాతుర్యం వరకు అన్ని బిగ్ బాస్ కి హెల్ప్ అవుతాయని, మరోపక్క యాంకర్ వర్షిణి ఆల్మోస్ట్ ఫిక్స్ అంటున్నారు. అందుకే స్టార్ మా కామెడీ షోకి వర్షిణి ని యాంకర్ గా తెచ్చి ముందే లాక్ చేసారని.. ఆమె అందాలే బిగ్ బాస్ సీజన్ 5 కి హైలెట్ అంటున్నారు. ఇక జబర్దస్త్ వర్ష, యూట్యూబ్ శివ, స్రవంతి, షణ్ముఖ్ పేర్లు ఇంకాస్త గట్టిగా వినిపిస్తున్న వాటిలో ఉన్నాయి. మరి ఫైనల్ గా ఆ 15 మందిలో ఎవరెవరు వస్తారో చూడాలి.