Advertisementt

ప్రభాస్-నాగ్ అశ్విన్: వీఎఫ్ఎక్స్ వేరే లెవల్లో

Thu 17th Jun 2021 12:36 PM
prabhas-nag ashwin combo,prabhas,director nag ashwin,pan world movie,prabhas - deepika padukone,prabhas - amithab,deepiak apdukone,prabhas pan world movie  ప్రభాస్-నాగ్ అశ్విన్: వీఎఫ్ఎక్స్ వేరే లెవల్లో
Prabhas-Nag Ashwin VFX on a different level ప్రభాస్-నాగ్ అశ్విన్: వీఎఫ్ఎక్స్ వేరే లెవల్లో
Advertisement
Ads by CJ

ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్ సినిమా షూటింగ్స్ లో బిజీ కాబోతున్నారు. సెకండ్ వేవ్ ముగిసింది. కరోనా తగ్గింది. దానితో సినిమా షూటింగ్ మొదలు కాబోతున్నాయి. ప్రభాస్ ముందుగా రాధేశ్యామ్ బ్యాలెన్స్ షూట్ ని ఫినిష్ చేసి సలార్ షూటింగ్ సెట్స్ కి వెళ్ళబోతున్నారట. ఇక భారీ బడ్జెట్స్ తో పాన్ ఇండియా లెవల్లో ప్రభాస్ రేంజ్ మాములుగా లేదు. సలార్ తో, ఆదిపురుష్ తో ప్రభాస్ ఆ మార్కెట్ ని మరింతగా పెంచబోతున్నాడు. అయితే ప్రభాస్ తదుపరి ప్రాజెక్ట్ నాగ్ అశ్విన్ దర్శకత్వం లో పాన్ ఇండియా రేంజ్ కాదు.. పాన్ వరల్డ్ రేంజ్ లో సైన్స్ ఫిక్సన్ నేపథ్యంతో తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. 

అయితే ఈ సినిమా పాన్ వరల్డ్ రేంజ్ లో 1000 కోట్ల బడ్జెట్ తో నిర్మించబోతున్నట్లుగా తెలుస్తుంది. అందులో ఈ సినిమాలో కీలకమైన వీఎఫ్ఎక్స్ వర్క్ కోసమే 200 కోట్లను కేటాయించారట. ఈ సినిమా ఎక్కువ భాగం  గ్రాఫిక్స్‌ మీదే ఆధారపడుతుంది అని సమాచారం. దానిలో భాగంగానే గ్రీన్ మ్యాట్ షాట్స్ కోసం భారీగా ఖర్చు చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమా టైమ్ మెషీన్ ఆధారంగా తెరకెక్కనున్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఇక ఈ సినిమాలో ఎక్కువగా బాలీవుడ్ నటులే కీలకం కాబోతున్నారు. అందులో హీరోయిన్ గా ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే, మరో కీ రోల్ లో బిగ్ బి నటించబోతున్న విషయం తెలిసిందే. 

Prabhas-Nag Ashwin VFX on a different level:

Prabhas-Nag Ashwin Pan world movie update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ