బాలకృష్ణ - బోయపాటి కాంబోలో హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కుతున్న అఖండ పై ట్రేడ్ లోను, ప్రేక్షకుల్లోనూ విపరీతమైన క్రేజ్ ఉంది. ఆ కాంబోలో వచ్చిన సింహ, లెజెండ్ మూవీస్ సన్సేషనల్ హిట్స్ అవడంతో ఇప్పుడు రాబోతున్న అఖండ పై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఈ సినిమాలో బాలకృష్ణ డ్యూయెల్ రోల్ పోషించబోతున్నారు. బాలకృష్ణ అఖండ లుక్ లో ఫాన్స్ కి పూనకాలు తెప్పిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీకాంత్ ఓ పవర్ ఫుల్ విలన్ గా కనిపించబోతున్నాడు. కొద్దిమేర షూటింగ్ బ్యాలెన్స్ ఉన్న అఖండ మూవీ.. రిలీజ్ డేట్ ని త్వరలోనే ప్రకటించనుంది టీం.
అయితే అఖండ మూవీలో బాలయ్య అఘోర పాత్రే హైలెట్ అని, అఘోరా పాత్ర అనేది జస్ట్ రోల్ లా కాకుండా ఆ పాత్ర ని మలిచిన తీరు చాలా ఉన్నతంగా ఉంటుందని.. విలన్ గా నటిస్తున్న శ్రీకాంత్ చెబుతున్నాడు. అంతేకాదు.. బాలయ్య చెప్పే డైలాగ్స్ థియేటర్స్ దద్దరిల్లిపోవడం ఖాయమని, థమన్ బ్యాగ్ రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి మరింత ప్లస్ కాబోతున్నట్లుగా చెప్పి సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసాడు శ్రీకాంత్. శ్రీకాంత్ చెప్పడం కాదు కానీ బాలయ్య అఖండ లో చెప్పబోయే డైలాగ్స్ వైసిపి నేతలను ఉద్దేశించి చేసిన హెచ్చరికలు అని అఖండ రెండు టీజర్ లోను హింట్ ఇచ్చేసాడు బోయపాటి.