Advertisementt

మీట్‌ క్యూట్‌ లో కాజల్

Fri 18th Jun 2021 12:44 PM
kajal aggarwal,nani meet cute,nani producer,nani ister deepthi ghanta,kajal aggarwal in meet cute,kajal aggarwal photos,kajal aggarwal news  మీట్‌ క్యూట్‌ లో  కాజల్
Kajal Aggarwal in talks for Meet Cute? మీట్‌ క్యూట్‌ లో కాజల్
Advertisement
Ads by CJ

నాని ప్రస్తుతం మూడు సినిమాల తో బిజిగా ఉండడమే కాదు.. మరోపక్క నిర్మాతగానూ స్పీడు పెంచాడు. నాని లేటెస్ట్ మూవీ టక్ జగదీశ్ రిలీజ్ కి సిద్ధంగా ఉంది. మరోపక్క శ్యామ్ సింగరాయ్ షూటింగ్ మొదలు కాబోతుంది. అలాగే అంటే సుందరానికి షూటింగ్ కూడా నాని మొదలుపెట్టేయ్యబోతున్నాడు. ఈలోపు మీట్‌ క్యూట్‌ అంటూ ఒక సినిమాని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకి నాని అక్క దీప్తి ఘంటా డైరెక్టర్. డెబ్యూ డైరెక్టర్ గా తమ్ముడు నాని నిర్మాణంలో దీప్తి ఘంటా తెరకెక్కిస్తున్న మీట్‌ క్యూట్‌ షూటింగ్ కూడా మొదలైపోయింది.

ఈ సినిమాలో సీనియర్ నటుడు సత్య రాజ్ ఓ కీలకపాత్ర పోషిస్తుండగా.. ఇప్పుడు టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ మరో కీలక పాత్రలో నటించబోతుంది అని అంటున్నారు. ఈ సినిమాలో ఐదుగు హీరోయిన్స్ ఉంటారట. అందులో ఓ లీడ్ కేరెక్టర్ కోసం కాజల్ ని సంప్రదిస్తున్నారట. ఇప్పటికే కథా చర్చలు పూర్తయ్యాయని, స్క్రిప్ట్‌ నచ్చడంతో ఈ ప్రాజెక్ట్‌ చేసేందుకు కాజల్ కూడా ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే అని చెబుతున్నారు. కాజల్ నటిస్తున్న ఆచార్య షూటింగ్ చివరి దశలో ఉండగా.. నాగార్జున తో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో జోడి కడుతుంది కాజల్. మరి ఇప్పుడు నాని మీట్ క్యూట్ లో కూడా కాజల్ నటిస్తుంది అనే టాక్ వినిపిస్తుంది. ఇంకా ఈ సినిమాలో నివేదా థామస్, రుహానీ శర్మ, అదా శర్మ ల పేర్లు హీరోయిన్స్ లిస్ట్ లో వినిపిస్తున్నాయి.

Kajal Aggarwal in talks for Meet Cute?:

Nani in talks with Kajal?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ