ఏపీలో కరోనా కేసులు తగ్గు ముఖం పడుతున్నాయి. మే మూడు నుండి ఏపీలో 18 గంటల కర్ఫ్యూని అమలు చేసింది జగన్ ప్రభుత్వం. ఉదయం ఆరు గంటల నుండి మధ్యాన్నం 12 గంటల వరకు ఆంక్షలు సడలింపులు ఇచ్చిన ప్రభుత్వం ఆ తర్వాత సమయంలో కఠినంగా కర్ఫ్యూని అమలు చేసింది. ఇక జూన్ 10 నుండి ఆ కర్ఫ్యులో సడలింపులు ఇచ్చింది. అందులో భాగంగా ఉదయం ఆరు నుండి మద్యాన్నం 2 గంటల వరకు ఆంక్షల సడలింపులు ఇవ్వగా.. ఇప్పుడు ఆ కర్ఫ్యూ సమయం ముగిసింది.
కరోనా కేసులు తగ్గుదలతో కర్ఫ్యూ ఆంక్షల సడలింపులు సమయాన్ని పెంచింది ఏపీ ప్రభుత్వం. ఉదయం ఆరు నుండి సాయంత్రం ఆరు గంటల వరకు సడలింపులు అమలులో ఉంటాయని, ఆ తర్వాత కఠినంగా కర్ఫ్యూ అమలవుతుంది అని.. ఈ సడలింపులు జూన్ 21 నుండి అమములోకి వస్తాయని జగన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉదయం ఆరు నుండి సాయంత్రం 5 గంటల వరకే దుకాణాలు తెరుచుకోవడానికి అనుమతి ఉంటుందని, మరో గంట సేపట్లో దుకాణాల సిబ్బందికి ఇంటికి వెళ్లేందుకు సమయం ఉంటుందని చెప్పారు.
అయితే కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ఈస్ట్ గోదావరిలో మాత్రం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే సడలింపు ఉంటుందని.. ఈ కర్ఫ్యూ జూన్ 30 వరకులు అమలులో ఉంటుంది అని ప్రకటించింది ఏపీ ప్రభుత్వం.