మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా అశోక్ గజపతిరాజుగారు తిరిగి చైర్మన్ అవడం వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. అందులో ముఖ్యంగా విజయ్ సాయి రెడ్డి గారు అశోక్ గజపతి రాజుగారి విషయంలో వరసగా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. మాన్సాస్ ట్రస్ట్‌లో వందల ఎకరాలు కాజేసిన దొంగ అశోక్‌గజపతిరాజు అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసారు ఎంపీ విజయసాయిరెడ్డి.. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అశోక్ గజపతిరాజుపై గతంలో ఫోర్జరీ కేసు కూడా ఉందని.. ఆయన జైలుకు వెళ్లడం తప్పదన్నారు.
మాన్సాస్ ట్రస్ట్ కు సాంబందించి హై కోర్టు తీర్పుపై అప్పీల్‌కు వెళ్తామని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. భూకబ్జా వ్యవహారంలో టీడీపీ నేతలు తాత్కాలికంగా స్టే తెచ్చుకోగలిగారు. చేసిన తప్పులకు శిక్ష నుంచి మాత్రం తప్పుకోలేరు. ప్రభుత్వ భూములు ఆక్రమించినవారిని వదిలిపెట్టేది లేదని..ఎంపీ విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు.