కరోనా సెకండ్ వేవ్ ముగిసింది. కరోనా కేసులు కొలిక్కి వస్తున్నాయి. దానితో సినిమా వాళ్లలో కదలిక మొదలైంది. సినిమా షూటింగ్స్ మళ్ళీ మొదలవుతున్నాయి. తెలంగాణాలో ఇప్పటికే సడలింపులతో ఒక్కొకకరుగా సెట్స్ మీదకెళుతున్నారు. ముందు నితిన్ మొదలు పెట్టాడు. జూన్ 24 తర్వాత మిగతా వాళ్ళు మొదలు పెట్టెయ్యబోతున్నారు. అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - రానా కాంబోలో సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఏకే రీమేక్.. హైదరాబాద్ లో వేసిన ఓ సెట్ లో మొదలు కాబోతుంది. పవన్ కూడా షూటింగ్ కి రెడీ అవుతున్నారు.
ఇక మహేష్ బాబు సర్కారు వారి పాట షూటింగ్ కి కూడా సన్నాహాలు మొదలు పెడుతున్నారు. మహేష్ బాబు - పరశురామ్ కాంబోలో మొదలైన ఈ మూవీ షూటింగ్ కరోనా వలన ఆగింది.. ఇక ఇప్పుడు జులై ఫస్ట్ వీక్ నుండి సర్కారు వారి పాట షూటింగ్ ని హైదరాబాద్ లోనే మొదలు పెట్టబోతున్నారట. ఈ షెడ్యూల్ షూటింగ్ వచ్చేనెల చివరి వరకూ నాన్ స్టాప్ గా సాగేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ లో మహేశ్ బాబుతో పాటు కీర్తి సురేష్ అలాగే కీలక నటులు షూటింగులో పాల్గొననున్నారని చెబుతున్నారు. ఇటు పవన్ అటు మహేష్ లు కూడా షూటింగ్ కి సై అంటున్నారు.