తెలంగాణాలో సెకండ్ వేవ్ ఉధృతి తగ్గడంతో.. లాక్ డౌన్ ఎత్తివేసింది కేసీఆర్ ప్రభుత్వం. అంతకుముందే.. లాక్ డౌన్ సడలింపులు ఉండడంతో హీరో నితిన్ గత సోమవారమే తన రీసెంట్ మూవీ మ్యాస్ట్రో సెట్స్ మీదకి వెళ్ళాడు. అందరి కన్నా ముందు టాలీవుడ్ లో నితిన్ షూటింగ్ స్టార్ట్ చేసాడు. మ్యాస్ట్రో ఫైనల్ షెడ్యూల్ అంటూ మొదలు పెట్టిన నితిన్ ఇప్పుడు దానిని పూర్తి చేసేసి షాకిచ్చాడు.
హీరో నితిన్ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం మ్యాస్ట్రో. నితిన్ 30వ మూవీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ క్రైమ్ కామెడీ చిత్రంలో నితిన్ సరసన నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా హీరోయిన్ తమన్నా కీలక పాత్ర పోషిస్తోంది. మ్యాస్ట్రో సినిమా చిత్రీకరణ పూర్తయింది.
మ్యాస్ట్రో సినిమా ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణ ఇటీవల హైదరాబాద్‌లో మొదలైన సంగతి తెలిసిందే. హీరో నితిన్, తమన్నాలపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు దర్శకుడు మేర్లపాక గాంధీ. సినిమాలో వచ్చే అత్యంత కీలకమైన సన్నివేశాలు ఇవి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత షూటింగ్‌లో పాల్గొన్న ఫస్ట్ స్టార్ హీరో మూవీ మ్యాస్ట్రో కావడం విశేషం.
ఇప్పటికే నితిన్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన మ్యాస్ట్రో ఫస్ట్‌లుక్, టీజర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తుంది. మహతి స్వరసాగర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇంతకు ముందు నితిన్ హిట్ మూవీ భీష్మకు మ్యూజిక్ డైరెక్టర్ మహతి స్వరసాగరే..