Advertisementt

షూటింగ్స్ తో ఎగ్జైట్ అవుతున్న హీరోయిన్

Sun 20th Jun 2021 05:15 PM
kiara advani,movie shootings,lock down,mumbai,maharashtra,resumes the shoot,mr. lele  షూటింగ్స్ తో ఎగ్జైట్ అవుతున్న హీరోయిన్
Shashank Khaitan resumes the shoot of Mr. Lele షూటింగ్స్ తో ఎగ్జైట్ అవుతున్న హీరోయిన్
Advertisement
Ads by CJ

గత రెండు నెలలుగా సినిమా షూటింగ్స్ ని పక్కనబెట్టి.. ఇంట్లోనే కూర్చోవాల్సి వచ్చింది. సెకండ్ వేవ్ కారణంగా రెండు నెలల లాక్ డౌన్ తో ఇంటికే పరిమితమైన హీరో - హీరోయిన్స్ ఒక్కొక్కరిగా సెట్స్ మీదకి వచ్చేస్తున్నారు. యధావిధిగా తమ తమ సినిమా షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. అందులో బాలీవుడ్ టాప్ లిస్ట్ లో ఉన్న కియారా అద్వానీ కూడా ఉంది. కియారా అద్వానీ ప్రస్తుతం బాలీవుడ్ మూవీస్ తో బిజీగా వుంది. లాక్ డౌన్ తో ఆ మూవీ షూటింగ్స్ అన్ని క్యాన్సిల్ అవడం, ఇప్పుడు మళ్ళీ మొదలు కావడం జరిగింది. తాజాగా తన కొత్త సినిమా షూటింగ్స్ లో పాల్గొంటూ కియారా తెగ ఎగ్జైట్ అవుతుంది.

చాలా రోజుల తర్వాత షూటింగ్ లో పాల్గొనడం ఆనందంగా, ఉత్సాహం ఉంది అని.. లాక్ డౌన్ తో ఖాళీగానే కూర్చున్నామని, మళ్ళీ పనిలో పడితే ఆ హ్యాపీనెస్ వేరు అంటుంది కియారా. ముంబై లో ఆంక్షల సడలింపు తో కియారా అద్వానీ మిస్టర్‌ లేలే షూటింగ్ లో పాల్గొంటుంది. విక్కీ కౌశల్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కియారా కీలక పాత్ర పోషిస్తుంది. ముంబై లో ప్రత్యేకంగా వేసిన సెట్ లో ఈ సినిమా షూటింగ్ఫ్ జరుగుతుంది. షూటింగ్ మొదలు పెట్టేముందే మూవీ యూనిట్ మొత్తం వ్యాక్సిన్ వేయించుకున్నారని, ఇలాంటి వాతావరణంలో పని చెయ్యడం సాహసమే అయినా.. అందరూ తగు జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ లో పాల్గొంటున్నట్టుగా చెబుతుంది కియారా అద్వానీ.

Shashank Khaitan resumes the shoot of Mr. Lele:

Kiara Advani resumes the shoot of Mr. Lele

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ