Advertisementt

ఆచార్యలో సంగీత పాత్ర అదే

Mon 21st Jun 2021 09:49 AM
acharya movie,chiranjeevi acharya movie,ram charan acharya movie,ram charan - chiru combo,ram charan - pooja hegde combo,chiru - kajal combo,koratala siva acharya movie,sangeetha,kajal,pooja hegde,chiranjeevi,ram charan,devi sri prasad,acharya  ఆచార్యలో సంగీత పాత్ర అదే
Sangeetha Role Details in Acharya Film ఆచార్యలో సంగీత పాత్ర అదే
Advertisement
Ads by CJ

చిరంజీవి - కొరటాల కాంబోలో క్రేజీ మూవీ గా తెరకెక్కుతూన్న ఆచార్య రెస్యూమ్ షూట్ ని జులై ఫస్ట్ వీక్ నుండి మొదలు పెట్టె యోచనలో టీం ఉంది. కరోనా సెకండ్ వేవ్ తో ఓ 20 రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉండిపోయింది. లేదంటే మే 13 న ఆచార్య థియేటర్స్ బాక్సాఫీసుని చీల్చి చెండాడేది. ఇక అప్పుడు ఆగిన షూటింగ్ మళ్లీ ఇప్పుడు మొదలు కాబోతుంది. ఓ సాంగ్ తో సహా రామ్ చరణ్ పై కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తే ఆచార్య షూటింగ్ పూర్తవుతుంది అని.. ఆచార్య సినిమాని ఆగష్టు 22 న చిరు బర్త్ డే రోజున రిలీజ్ చెయ్యొచ్చని అంటున్నారు. ఇక ఈ సినిమాలో నీలాంబరిగా పూజ హెగ్డే లుక్, కాజల్ అగర్వాల్ లుక్ ని వేరే.. వేరే అకేషన్స్ అప్పుడు వదిలింది టీం. 

ఈ సినిమాలో సీనియర్ నటి సంగీత ఓ కేరెక్టర్ లో కనిపించబోతుంది. చిరు తో లాగే లాగే అంటూ డాన్స్ అదరగొట్టేసింది సంగీత పాత్రపై అందరిలో ఆసక్తి ఏర్పడింది. అయితే సంగీత పాత్ర ఆచార్య లో చాలా ఎమోషనల్ గా ఉంటుంది అని, ఇంటర్వెల్ కి ముందు ఆమె పాత్ర చనిపోతుంది అని, దానితోనే రామ్ చరణ్ సిద్ధగా ఆచార్య ఎంట్రీ ఉంటుంది అని అంటున్నారు. ఆచార్య లో సంగీత పాత్ర ఇదే అంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. ఇక రామ్ చరణ్ - చిరు కాంబో సీన్స్ సినిమాకే హైలెట్ గా ఉండబోతున్నాయని, అలాగే హీరో ఎలివేషన్ సీన్స్ కూడా అద్భుతంగా వచ్చాయని మూవీ టీం చెబుతుంది.

Sangeetha Role Details in Acharya Film:

Actress Sangeetha Role Details in Acharya

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ