సినిమాల్లో హీరో - విలన్ పోటీ పడితే హీరోనే గెలుస్తాడు. అది సినిమాల్లో ఉండే కథల సారాంశం. కానీ ఇప్పుడు నిజంగానే హీరో పాత్రధారి - విలన్ పాత్రధారి రియల్ గా పోటీ పడితే ఆ మజానే వేరు. ఈమధ్యన కాంట్రవర్సీలకు నెలవుగా మారిన మా ఎలక్షన్స్.. ఇప్పుడు మరోసారి రసవత్తర పోరుకి తెర లేపబోతుంది. గత ఏడాది రాజశేఖర్ - సీనియర్ హీరో నరేష్ మధ్యన పోటాపోటీగా మారిన మా అసోసిషియన్.. చాలారకాల కాంట్రవర్సీలతో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇప్పుడు తాజాగా మా ఎలక్షన్స్ లో నటుడు ప్రకాష్ రాజ్ పోటీ చెయ్యబోతున్నారు. ప్రకాష్ రాజ్ స్వయంగా తాను మా ఎలక్షన్స్ లో పోటీ చెయ్యబోతున్నట్టుగా ప్రకటించారు.
తాజాగా ప్రకాష్ రాజ్ కి పోటీగా మంచు విష్ణు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎలక్షన్స్ లో పోటీ పడబోతున్నారనే న్యూస్ వినిపిస్తుంది. సినిమాల్లో విలన్ - హీరో ఢీ అంటే ఢీ అంటారు. దానికే ఫాన్స్ కి పూనకలొచ్చేస్తాయి. కానీ ఇప్పుడు మా ఎన్నికల్లో హీరో పాత్రధారి విష్ణు - విలన్ పాత్రధారి ప్రకాష్ రాజ్ పోటీ పడుతున్నారు. అంటే ఈ ఎలక్షన్స్ నిజంగానే సినిమా కన్నా ఎక్కువ క్యూరియాసిటీని కలిగించడం ఖాయం. ఇక ప్రకాష్ రాజ్ తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న సమస్యల గురించి నాకు పూర్తిగా అవగాహన ఉంది. ఆ సమస్యలను అధిగమించడానికి నా దగ్గర సరైన ప్రణాళిక కూడా ఉంది.. అందుకే ఈ ఎన్నికల్లో నిలబడుతున్నాను. మా ని అందనంత ఎత్తులో నిలబెట్టడానికి నా వంతు కృషి చేస్తాను అన్నారు. అయితే మంచు విష్ణు మా ఎన్నికల్లో నిలబడుతున్నారో.. లేదో.. అనేది.. త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశం ఉంది అంటున్నారు.