నిన్న సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫాన్స్, ఎన్టీఆర్ ఫాన్స్ ఒకరి మీద ఒకరు అసభ్య పదజాలాలతో రెచ్చిపోయారు. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అనేది పోయి.. మీ హీరో కి ఈగో అంటే మీ హీరో పంది అంటూ రెచ్చిపోయి ట్వీట్స్ చేసి.. ట్రెండ్ అయ్యారు. తమ హీరోలపై ఎంతో అభిమానం చూపించే అభిమానులు.. ఎదుటి హీరోలపై అక్కసు వెళ్లగక్కడం చూస్తూనే ఉన్నాము. తరుచూ పవన్ ఫాన్స్ ఇతర హీరోలపై పడిపోతుంటారు. అలాగే తమిళంలో విజయ్ ఫాన్స్ vs అజిత్ ఫాన్స్ అంటూ హాట్ హాట్ గా రచ్చ జరుగుతూనే ఉంటుంది. సోషల్ మీడియాలో తమ హీరోలకు మద్దతుగా ట్వీట్స్ చేస్తూ ఇతర హీరోలని కించపరుస్తుంటారు. ఈ ఫాన్స్ వార్ నార్త్ నుండి సౌత్ వరకు ఉన్నదే.
తాజాగా సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫాన్స్ - ఎన్టీఆర్ ఫాన్స్ ట్విట్టర్ యుద్ధం మొదలు పెట్టారు. ఎన్టీఆర్ ని తిడుతూ అల్లు అర్జున్ ఫాన్స్, అల్లు అర్జున్ ని తిడుతూ ఎన్టీఆర్ ఫాన్స్.. మా హీరో గొప్ప మీ హీరో వెస్ట్ అంటూ ట్వీట్ల యుద్ధం చేసారు. #InsecureFoxAlluArjun అంటూ ఎన్టీఆర్ ఫాన్స్ అల్లు అర్జున్ పై పడితే.. #CharacterLessPigNTR, #BLACKMAILPIGNTR అంటూ అల్లు అర్జున్ ఫాన్స్ ఎన్టీఆర్ పై పడ్డారు. దర్శకనిర్మాతలతో ఎన్టీఆర్ ఎక్కువగా క్లోజ్ అయ్యి.. తనతోనే సినిమాలు తియ్యాలని ఒత్తిడి చేస్తుంటాడంటూ.. అల్లు అర్జున్ ఫాన్స్ ఎన్టీఆర్ పై రెచ్చిపోయారు. ఇక ఐకాన్ స్టార్ అంటూ తనకి తానుగా అల్లు అర్జున్ బిరుదు ఇచ్చేసుకున్నాడంటూ.. అల్లు అర్జున్ ని కామెంట్స్ చేస్తున్నారు ఎన్టీఆర్ ఫాన్స్. నిన్న మొత్తంగా అల్లు అర్జున్ ఫాన్స్, ఎన్టీఆర్ ఫాన్స్ ట్రెండ్ చేసిన #CharacterLessPigNTR, #InsecureFoxAlluArjun హాష్ టాగ్స్ ట్విట్టర్ లో తెగ హైలెట్ అయ్యాయి.