రాజమౌళి డైరెక్షన్ లో రామ్ చరణ్ - ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిలిం ఆర్.ఆర్.ఆర్ పోస్ట్ కరోనా షూటింగ్ నిన్ననే మొదలైంది. ఎలాంటి హడావిడి లేకుండా రామ్ చరణ్ నిన్న ఆర్.ఆర్.ఆర్ సెట్స్ లో అడుగుపెట్టేసాడు. రామ్ చరణ్ - ఎన్టీఆర్ పై సాంగ్ షూట్ తో పాటుగా.. మరొకొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ మిగిలే ఉండడంతో రాజమౌళి సీరియస్ గా షూటింగ్ మొదలు పెట్టారు. ఇక రామ్ చరణ్ నిన్న ఆర్.ఆర్.ఆర్ సెట్స్ లో జాయిన్ అవ్వగా.. ఎన్టీఆర్ ఈ రోజు జాయిన్ అయినట్లుగా తెలుస్తుంది. ఎన్టీఆర్ - రామ్ చరణ్ పై ఆర్.ఆర్.ఆర్ స్పెషల్ సాంగ్ ని 20 నుండి 25 రోజుల పాటు చిత్రీకరించబోతుందట టీం.
దాని కోసం ఫిలిం సిటీలో ఓ భారీ సెట్ నిర్మాణంలో ఉంది. కీరవాణి మ్యూజిక్ అందిస్తున్న ఆర్.ఆర్.ఆర్ స్పెషల్ సాంగ్ ఏకంగా 8 నిమిషాల నిడివి ఉంటుంది అని, ఎన్టీఆర్ - రామ్ చరణ్ కలయికలో ఆ సాంగ్ ఫాన్స్ కి ఫుల్ మీల్స్ అంటున్నారు. ఈ సాంగ్ లో అద్భుతమైన గ్రాఫిక్స్ ని కూడా జోడించబోతున్నారట. అయితే ఈ సాంగ్ లో ఎన్టీఆర్ - రామ్ చరణ్ డాన్స్ ఉంటుందా? లేదంటే దేశభక్తికి సంబందించిన పాటగా ఉండబోతుందా? అనేది సస్పెన్స్. ఏదైనా ఎన్టీఆర్ - రామ్ చరణ్ కలిసి ఒకే సాంగ్ లో అంటే ఫాన్స్ కి పూనకాలే.. ఇక రామ్ చరణ్ - ఎన్టీఆర్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ కూడా ఓ వారం పాటు పడుతుందట. అంటే దాదాపుగా ఓ 35 నుండి 40 రోజుల షూటింగ్ ఆర్.ఆర్.ఆర్ కి మిగిలి ఉన్నట్లుగా తెలుస్తుంది.