Advertisementt

ఫ్యామిలీ మ్యాన్ 3 లో ఆ హీరో

Tue 22nd Jun 2021 05:33 PM
vijay setupathi,family man makers,raj and dk,family man season 3  ఫ్యామిలీ మ్యాన్ 3 లో ఆ హీరో
Vijay Sethupathi in The Family Man 3? ఫ్యామిలీ మ్యాన్ 3 లో ఆ హీరో
Advertisement
Ads by CJ

దర్శకులు రాజ్ అండ్ డీకే వెబ్ సీరీస్ లో ఓ కొత్తవరవడికి తెర లేపారు. ఫ్యామిలీ మ్యాన్ 1 అంటూ సంచలనం సృష్టించిన మేకర్స్  ఫ్యామిలీ మ్యాన్ 2 తోనూ కొత్త రికార్డులు సృష్టించారు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఫ్యామిలీ మ్యాన్ 2 ఇండియా వైడ్ ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది.. ఫ్యామిలీ మ్యాన్ వన్ ని బాలీవుడ్ కే పరిమితం చేసిన మేకర్స్ 2 ని మాత్రం పాన్ ఇండియా వెబ్ సీరీస్ గా తెరకెక్కించి హిట్ కొట్టారు. ఈ సీరీస్ లో సౌత్ హీరోయిన్ సమంత మెయిన్ హైలెట్ కాగా.. ఈ సీరీస్ అందరిని ఆకట్టుకుంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ లో ఉన్న ఫ్యామిలీ మ్యాన్ 2 తెలుగు వెర్షన్ కోసం తెలుగు ప్రేక్షకులు వెయిటింగ్. అయితే ఫ్యామిలీ మ్యాన్ 2 కి సీక్వెల్ గా 3 ఉండబోతుంది అంటూ హింట్ ఇచ్చేసారు మేకర్స్.

అందులో నటించబోయే నటులపై ఇండియా వైడ్ ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. ఈసారి ఫ్యామిలీ మ్యాన్ 3 లో సౌత్ నటులకి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది అని.. అందులో కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి పేరు బాగా వినిపిసిస్తుంది. పలు సినిమాలతో క్రేజీ నటనతో మంచి పెరఫార్మెర్ గా పేరు తెచ్చుకున్న విజయ్ సేతుపతి పేరు ఫ్యామిలీ మ్యాన్ 3 కోసం ఎక్కువగా వినిపించడం ఇప్పుడు హైలెట్ గా మారింది. మరి విజయ్ సేతుపతి ని ఫ్యామిలీ మ్యాన్ మేకర్స్ కలిసారని.. ఇప్పటికే ఆయనతో చర్చలు పూర్తయినట్టుగా చెబుతున్నారు. విజయ్ సేతుపతి ఫ్యామిలీ మ్యాన్ 3 లో చిన్న రోల్ వేసినా..ఆ సీజన్ కి వచ్చే క్రేజ్ ని ఆపడం ఎవరి తరం కాదు.

Vijay Sethupathi in The Family Man 3?:

Vijay Setupathi In The Family Man Season 3

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ