Advertisementt

క్రాక్ లో శృతి ని వాడినట్లుగా సలార్ లో కూడా

Wed 23rd Jun 2021 10:49 PM
prabhas,salaar pan india film,prabhas salaar movie,prashanth neel - prabhas combo,prabhas - shruthi haasan combo,prabhas - prashanth neel - shruthi haasan combo,salaar prabhas,prashanth neel salaar,salaar villina,shruti hassan action scenes  క్రాక్ లో శృతి ని వాడినట్లుగా సలార్ లో కూడా
Shruti Hassan Action scenes in Salaar Movie క్రాక్ లో శృతి ని వాడినట్లుగా సలార్ లో కూడా
Advertisement
Ads by CJ

క్రాక్ సినిమాతో తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్చింది కోలీవుడ్ భామ శృతి హాసన్. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న శృతి హాసన్ రవితేజ క్రాక్ లో నటించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. లుక్స్ పరంగా విమర్శలు ఎదుర్కొన్న శృతి హాసన్ కి ఆ సినిమాలో చేసిన ఫైట్ ఆమెకి మరిన్ని అవకాశాలు తెచ్చిపెట్టింది. క్రాక్ సినిమాలో శృతి హాసన్ ఫైట్ హైలెట్ అనేలా ఉంటుంది. ఆ యాక్షన్ సీన్ చూసే ఆమెకి పాన్ ఇండియా మూవీ సలార్ లో అవకాశం ఇచ్చారని, ఆ ఫైట్ సీన్ కె ప్రశాంత్ నీల్ ఆమెకి అంత పెద్ద ప్రాజెక్ట్ లో అవకాశం ఇచ్చారని అన్నారు. 

అయితే సలార్ లో శృతి హాసన్ ప్రభాస్ సరసన జోడిగా ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా నటిస్తుందని ఎఫ్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు.. ఇందులో శృతి హాసన్ పాత్ర ఎంతో హైలైట్‌గా ఉంటుందట. అంతేకాదు.. శృతి హాసన్ ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ కూడా చేస్తుందట. ఆ యాక్షన్ సన్నివేశాల కోసం ఈ బ్యూటీ మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ కూడా తీసుకోబోతుందన్న టాక్ వినిపిస్తోంది. ఈ లెక్కన సలార్ మూవీ లో ప్రభాస్‌తో కలిసి శృతి హాసన్ కూడా ఫైటింగ్ సీన్స్ చేయనుందన్నమాట. క్రాక్ లో వచ్చిన క్రేజ్ ఇలా సలార్ కోసం కూడా వాడేస్తున్నారన్నమాట. 

Shruti Hassan Action scenes in Salaar Movie:

Shruti Hassan Action scenes highlight in Salaar

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ