ప్రియమణి కొన్నాళ్ళు అవకాశాలు లేక ఢీ డాన్స్ షో కి జేడ్జ్ గా మారింది. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో అవకాశాల జోరుగా కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉంది. పెళ్లి తర్వాత ప్రియమణి కెరీర్ జోరందుకుంది. బాలీవుడ్ లో ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ తో అలరించిన ప్రియమణి.. తెలుగులో రెండు డిఫ్రెంట్ మూవీస్ లో నటించింది. విరాట పర్వం, వెంకటేష్ నారప్ప మూవీస్ లో ప్రియమణి డీ గ్లామర్ పాత్రల్లో కనిపించబోతుంది. ఈ రెండు సినిమాలు రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి.
ఇక తాజాగా ప్రియమణి కి మరో బంపర్ ఆఫర్ తగిలినట్లుగా తెలుస్తుంది. అది కూడా కన్నడ లో హిట్ అయిన యాక్ట్ 1978 సినిమాని తెలుగులో ఠాగూర్ మధు రీమేక్ చేయబోతున్నాడట. అందులో ప్రియమణి నే హీరోయిన్ గా తీసుకోబోతున్నారట. యాక్ట్ 1978 లో యజ్ఞ శెట్టి కీ రోల్ పోషించింది. ఇప్పుడు అదే పాత్రలో ప్రియమణి కనిపించబోతుంది అని తెలుస్తుంది. ఈ సినిమాలో ప్రియమణి గర్భవతి గా నటించబోతుందట. ఆ కథ సారాంశం ఏమిటంటే.. ఒక మహిళ ప్రభుత్వం నుంచి తనకి రావలసిన నష్టపరిహారం కోసం, ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోతుంది. చివరికి మానవ బాంబుగా మారి ఆఫీసుకు వెళ్లి, ఎవరూ బయటికి వెళ్లకుండా తలుపులు మూసేస్తుంది. ఆతర్వాత ఏం జరిగింది అనేది ఈ సినిమా కథ. మరి ప్రియమణికి ఈ అవకాశం దక్కితే మరోసారి పెరఫార్మెన్సు ఓరియెంటెడ్ తో అదరగొట్టెయ్యడం ఖాయం.