Advertisementt

రెండు షిఫ్ట్ ల్లో రామ్ చరణ్

Thu 24th Jun 2021 01:00 PM
ram charan,sidda as acharya,alluri sita ramaraju as rrr,ram charan new,resume shoot for acharya - rrr,acharya movie,rrr pan india movie  రెండు షిఫ్ట్ ల్లో రామ్ చరణ్
Ram Charan to do double shift? రెండు షిఫ్ట్ ల్లో రామ్ చరణ్
Advertisement
Ads by CJ

సెకండ్ వేవ్ ముగిసింది.. టాలీవుడ్ లో షూటింగ్స్ మొదలయ్యాయి.  భారీ, చిన్న ప్రాజెక్ట్స్ అన్ని మెల్లగా సెట్స్ మీదకి చేరుతున్నాయి. అందులో రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ కూడా  షూటింగ్ మొదలు పెట్టుకుంది. మొదలైన రోజునే రామ్ చరణ్ ఆర్.ఆర్.ఆర్ సెట్స్ లో జాయిన్ అయ్యాడు. ఇక తాజాగా ఎన్టీఆర్ కూడా ఆర్.ఆర్.ఆర్ సెట్స్ లో జాయిన్ అయినట్లుగా తెలుస్తుంది. రామ్ చరణ్ అటు ఆర్.ఆర్.ఆర్ ఇటు ఆచార్య షూటింగ్స్ కంప్లెట్స్ చెయ్యాల్సి ఉంది. 

ఆర్.ఆర్.ఆర్ లో ఇదే లాస్ట్ షెడ్యూల్. ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి చెయ్యాలని మేకర్స్ చూస్తున్నారు. అంటే రామ్ చరణ్ ఎలాంటి గ్యాప్ ఇవ్వకుండా ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ లో పాల్గొనాల్సిందే. మరో పక్క చిరు ఆచార్య షూటింగ్ కి రామ్ చరణ్ హాజరవ్వాల్సి ఉంది. రామ్ చరణ్ తో ఓ సాంగ్, అలాగే  షూటింగ్ మిగిలి ఉండడంతో కొరటాల ఇప్పుడు చరణ్ తో షెడ్యూల్ కోసం షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు. జులై ఫస్ట్ వీక్ నుండి మొదలు కాబోతున్నట్లుగా తెలుస్తుంది. 

అంటే రామ్ చరణ్ ఆర్.ఆర్.ఆర్, ఆచార్యకి రెండు షిఫ్ట్ ల్లో పని చెయ్యాల్సింది. అంటే డే అండ్ నైట్ షూటింగ్స్ తో రామ్ చరణ్ బిజీ. ఇప్పుడు రెండు సినిమాల భవితవ్యం చరణ్ చేతుల్లోనే ఉంది. కాబట్టి రామ్ చరణ్ ఇప్పుడు రెండు షిఫ్ట్ ల్లో రెండు సినిమాల షూటింగ్స్ పూర్తి చెయ్యాల్సిందే. 

Ram Charan to do double shift?:

Ram Charan to resume shoot for Acharya - RRR

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ