Advertisementt

రష్మిక అభిమాని ఇంత క్రేజీనా

Thu 24th Jun 2021 06:48 PM
rashmika mandanna,google traveling,900kms,muggula,viratpet,kodagu,mumbai shoot  రష్మిక అభిమాని ఇంత క్రేజీనా
A crazy fan goes in search of Rashmika Mandanna రష్మిక అభిమాని ఇంత క్రేజీనా
Advertisement
Ads by CJ

స్టార్స్ అంటే అభిమానం చూపించేవాళ్ళు లక్షల్లో ఉంటారు. హీరోలు- హీరోయిన్స్ కి ఆ అభిమానులే కొండంత అండ. ఒక్కోసారి ఆ ఆభిమానులు చేసే పనులు హద్దులు దాటుతుంటాయి. తమ హీరోల సినిమాలు రిలీజ్ అయినప్పుడు బ్యానర్లు కట్టడం, అలాగే పాలాభిషేకాలు వంటివి చెయ్యడం చూస్తున్నాం. ఇక తమ అభిమాన హీరో ఫంక్షన్ అనగానే తమకేమైనా దెబ్బలు తాకుతాయి అని కూడా ఆలోచించకుండా తొక్కేసుకుంటారు. తాజాగా రష్మిక మందన్న అభిమాని ఆమె కోసం ఏకంగా 900 కిలోమీటర్లు ప్రయాణం చెయ్యడం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం క్రేజీ హీరోయిన్ గా టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు సినిమాలు చేస్తున్న రశ్మికకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 

అయితే అందులో ఓ అభిమాని రష్మిక ఇంటిని గూగుల్ లో సెర్చ్ చేసుకుంటూ.. 900 కిలోమీటర్లు ప్రయాణం చెయ్యడమే విడ్డురంగా ఉంది. తెలంగాణకు చెందిన ఆకాష్ త్రిపాఠి అనే అతనికి రష్మిక అంటే భీబత్సమైన ఇష్టం. ఆ ఇష్టం తోనే అతను రష్మిక ఇంటిని గూగుల్ లో సెర్చ్ చేస్తూ ఆమె ఇల్లు కర్ణాటకలోని కొడగు సమీపంలో విరాజ్ పేట అని తెలుసుకొని.. ఓ 900 కిలోమీటర్ల ప్రయాణం చేసి అక్కడి వరకు చేరుకున్నాడు. మైసూర్ వరకు రైల్లో వెళ్లి అక్కడి నుండి ఓ ఆటో ద్వారా రష్మిక ఊరికి వెళ్ళాడు. అయితే ఆ ఊరికి వెళ్ళాక అతనికి రష్మిక ఇల్లు కనుక్కోవడం పెద్ద పజిల్ గా మారింది.

అక్కడే అందరిని రష్మిక ఇంటి గురించి వాకబు చేస్తుండగా.. ఆ ఊరి వాళ్ళకి అనుమానం వచ్చి పోలీస్ లకి ఫిర్యాదు చెయ్యడంతో.. అతన్ని ప్రశ్నించిన పోలీస్ లకి ఆకాష్ తాను రష్మిక కోసమే వచ్చా అని చెప్పడం.. ఆ టైం లో ఆమె ముంబై షూటింగ్ కి వెళ్లిపోవడంతో.. పోలీస్ లు ఆకాష్ కి నచ్చజెప్పి అతన్ని తిరిగి వెనక్కి పంపెయ్యడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అభిమానం ఉంటె ఉండొచ్చు కానీ.. మరీ ఇంత అభిమానం ఉంటుందా అంటున్నారు. 

A crazy fan goes in search of Rashmika Mandanna:

Goes in search of Rashmika over google

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ