Advertisementt

అన్నయ్య ఆశీస్సులు మాకే అంటున్న బాబు

Fri 25th Jun 2021 01:41 PM
nagababu,maa elections,chiranjeevi,chiru blessings for prakash raj,prakash raj  అన్నయ్య ఆశీస్సులు మాకే అంటున్న బాబు
Nagababu About Chiranjeevi Support to Prakash Raj అన్నయ్య ఆశీస్సులు మాకే అంటున్న బాబు
Advertisement
Ads by CJ

మా ఎలక్షన్స్ లో చిరు మద్దతు ఎవరికీ ఇప్పుడదే టాలీవుడ్ లో హాట్ టాపిక్. ఈ నేపథ్యంలోనే ప్ర‌కాశ్ రాజ్ కి మద్దతుగా నిలిచిన నాగ‌బాబు మీడియాతో మాట్లాడుతూ.. ప్ర‌కాశ్ రాజ్ చాలా మంచి వ్య‌క్త‌ని, మస‌క‌బారిన‌ మా అసోసియేష‌న్ ప్ర‌తిష్ఠ మ‌ళ్లీ పెర‌గాల‌ని, చిరంజీవి మ‌ద్ద‌తు త‌మ‌కు ఉంద‌ని చెప్పారు. ప్ర‌కాశ్ రాజ్ కు ప్ర‌తి భాష‌తో ట‌చ్ ఉంది. ఎవ‌రితోనైనా స‌రే వారి భాష‌లో మాట్లాడ‌గ‌లిగే స‌త్తా ఉన్న వ్య‌క్తి. ఎవ‌రితో అయినా స‌రే ఏ ప‌ని అయినా స‌రే చేయించుకోగ‌లిగే వ్య‌క్తి. అంతేకాదు, ప్ర‌కాశ్ రాజ్ నాలుగైదు ఏళ్లుగా ఎన్నో సేవా కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నారు అని నాగ‌బాబు తెలిపారు. 

మూడు-నాలుగు గ్రామాలు ద‌త్త‌త తీసుకుని సేవ‌లు అందిస్తున్నారు. చాలా మందికి ఇళ్లు క‌ట్టించారు. చాలా మందికి సాయం చేశారు. ఇటువంటి వ్య‌క్తి మా లో ఉంటే ప్ర‌తి ఒక్క‌రూ ఆయ‌న‌ను సంప్ర‌దించొచ్చు. మా అసోసియేషన్‌ మాది అనే భావ‌న క‌లుగుతుంది. ఇందాక ప్ర‌కాశ్ రాజ్ కూడా ఇది ప్ర‌స్తావించారు అని నాగ‌బాబు చెప్పారు. లోకల్, నాన్ లోక‌ల్ అంటూ వాదిస్తున్నారు. అలా వాదించ‌డం అర్థ‌ర‌హితం. ఎందుకంటే మా అసోసియేష‌న్‌లో స‌భ్యత్వం తీసుకున్న ప్ర‌తి వ్య‌క్తికి మా అధ్య‌క్ష ప‌దవి నుంచి ఎగ్జిక్యూటివ్ మెంబ‌ర్ దాకా పోటీ చేసే అవ‌కాశం ఉంటుంది అని అన్నారు.

అన్న‌య్య ఆశీర్వాదాలు కూడా మ‌న‌కు ఉన్నాయి. దీనికి సంతోషిస్తున్నాం. అన్న‌య్య‌ను ప్ర‌కాశ్ రాజ్ గారు అడిగిన‌ప్పుడు .. మాలో పోటీ చేయాల‌ని అన్న‌య్య చెప్పాడు అని నాగ‌బాబు చెప్పారు. అయితే, తాను నేరుగా ఇన్వాల్వ్ కాన‌ని చెప్పారు. కానీ, మా అసోసియేష‌న్ మంచి ప‌నులు చేస్తే మ‌ద్ద‌తుగా ఉంటాన‌ని చెప్పారు.. అంటూ మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ కి చిరు మద్దతు ఉంది అని నాగబాబు తేల్చేసారు. 

Nagababu About Chiranjeevi Support to Prakash Raj:

Nagababu says about Chiranjeevi blessings for Prakash raj

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ