ఈ రోజు రోజు తెల్లవారు ఝామున జరిగిన రోడ్డు ప్రమాదంలో సినీ నటుడు కత్తి మహేష్ కు తీవ్ర గాయాలు అవడంతో ఆయన్ని నెల్లూరి లోని మెడికవర్ కార్పొరేట్ హాస్పిటల్ కి తరలోంచి చికిత్స అందిస్తున్నారు. అయితే కత్తి మహేష్ కి ఆ యాక్సిడెంట్ లో చిన్న చిన్న గాయాలు మాత్రమే అయ్యాయి అని, పెద్దగా ప్రమాదం ఏం లేదని అన్నారు. తాజాగా బయటికి వచ్చిన ఫొటోస్ చూస్తే మహేష్ కి తీవ్రమైన గాయాలు అయినట్లుగా తెలుస్తుంది
తాజా సమాచారం ప్రకారం మహేష్ ని స్పెషల్ ఇసోలేషన్ లో వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నరట వైద్యులు.. మహేష్ ఆరోగ్య పరిస్థితి విషంగా ఉందని .. మరికొన్ని గంటల తర్వాత హెల్త్ బులిటెన్ విడుదల చెయ్యడానికి మెడికవర్ హాస్పిటల్ యాజమాన్యం సిద్దమవుతున్నట్లుగా తెలుస్తుంది. ఆ ప్రమాద సమయంలో మహేష్ తో పాటు డ్రైవర్ ఉన్నట్లు సమాచారం. డ్రైవర్ ఇచ్చిన సమాచారం తో కత్తి మహేష్ గా గుర్తించిన పోలీసులు, హై వే పెట్రోలింగ్ సిబ్బంది... హుటాహుటిన ఆయన్నిమెడికల్ హాస్పిటల్ కు తరలించినట్లుగా తెలుస్తుంది.