కొన్నాళ్లుగా తెలంగాణ పీసీసీ చీఫ్ గా అధిష్టానం ఎవరిని నియమిస్తుందో అంటూ చాలామంది కాంగ్రెస్ నేతలే ఎదురు చూస్తూన్నారు. సీనియర్ నాయకులూ బహిరంగంగానే పీసీసీ చీఫ్ కావాలంటూ అధిష్టానాన్ని ఒత్తిడి చేస్తున్నారు. కొన్నాళ్లుగా సస్పెన్స్ మెయింటింగ్ చేస్తున్న కాంగ్రెస్ అధిష్టానం తాజాగా పీసీసీ చీఫ్ పదవి విషయంలో తేల్చేసింది. టీపీసీసీ అధ్యక్షుడిగా ఎంపీ రేవంత్‌రెడ్డిని నియమిస్తూ ఏఐసీసీ ప్రకటించింది.
ఎప్పటినుండో ప్రచారం జరుగుతున్నట్టుగానే పీసీసీ చీఫ్ గా రెవంత్ రెడ్డి పేరునే ఖరారు చేసారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్స్‌గా మహ్మద్ అజారుద్దీన్, జె.గీతారెడ్డి, ఎం.అంజన్‌కుమార్ యాదవ్, టి.జగ్గారెడ్డి, బి.మహేశ్‌కుమార్ గౌడ్‌లు నియమితులయ్యారు. ఉపాధ్యక్షులుగా చంద్రశేఖర్ సంబని, దామోదర్‌రెడ్డి, రవి మల్లు, పొడెం వీరయ్య, సురేశ్ షెట్కార్, వేం నరేందర్‌రెడ్డి, రమేశ్ ముదిరాజ్, గోపిశెట్టి నిరంజన్, టి.కుమార్ రావు, జావేద్ ఆమీర్ నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది.