Advertisementt

రిలీజ్ డేట్స్ ఇవ్వండి.. థియేటర్స్ ఓపెన్ చేస్తాం

Sat 26th Jun 2021 09:56 PM
theaters,release movies,corona second wave,covid 19,theaters open,telangana,ap,2 states  రిలీజ్ డేట్స్ ఇవ్వండి.. థియేటర్స్ ఓపెన్ చేస్తాం
Give release dates - We will open theaters రిలీజ్ డేట్స్ ఇవ్వండి.. థియేటర్స్ ఓపెన్ చేస్తాం
Advertisement
Ads by CJ

సెకండ్ వేవ్ ముగిసింది.. తెలంగాణాలో లాక్ డౌన్ ఎత్తేసారు. అన్ని యాధస్థితికి వచ్చేసాయి. అంటే థియేటర్స్ కూడా ఓపెన్ అవ్వాలి. కానీ ఇంతవరకు తెలంగాణాలో థియేటర్స్ ఓపెన్ చేసిన దాఖలాలు లేవు. కారణం ఒక్కటే ప్రస్తుతం రిలీజ్ అయ్యే సినిమాలు లేకపోవడమే. ఒక్క తెలంగాణాలో థియేటర్స్ ఓపెన్ అయితే ఉపయోగం ఉండదు. పక్క రాష్ట్రం ఏపీలో ఇంకా కర్ఫ్యూ కొనసాగుతుంది. అందుకే హీరోలు రిలీజ్ డేట్స్ ఇవ్వడానికి వెనుకాముందు ఆడుతున్నారు. ఏపీలో కర్ఫ్యూ ఎత్తేస్తే.. దర్శకనిర్మాతల్లో ఊపొచ్చి రిలీజ్ డేట్స్ మొదలయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. 

లవ్ స్టోరీ, టక్ జగదీశ్, విరాట పర్వం లాంటి సినిమాల డేట్స్ వస్తే.. ఒక నెలకి సరిపోయే సినిమాలు ఉన్నాయి. అంటే జులై ఫస్ట్ నుండి థియేటర్స్ ఓపెన్ చేస్తే కలిసొస్తుంది. కానీ థియేటర్స్ మాత్రం సినిమాల్లేకూండా ఎలా ఓపెన్ చేస్తారు. ఏపీ, తెలంగాణల్లో పూర్తి స్థాయిలో థియేటర్స్ ఓపెన్ అయితే కానీ ఈ రిలీజ్ డేట్స్ జాతర మొదలు కాదు.. థియేటర్స్ వాళ్లేమో మీరు రిలీజ్ డేట్స్ ఇవ్వండి.. మేము ఓపెన్ చేస్తాం అంటున్నారు. లవ్ స్టోరీ, టక్ జగదీశ్, విరాట పర్వం మూవీ లు ముందు దిగితే.. ఆ తర్వాత లిస్ట్ లో ఆచార్య, బాలయ్య అఖండ, రవితేజ ఖిలాడీ లు దిగుతాయి. మరి జులై 1 నుండి థియేటర్స్ ఓపెన్ చేస్తారో..  నెలాఖరున కానీ ఓపెన్ చేస్తారో అనే సస్పెన్స్ మాత్రం ఓ వన్ వీక్ సాగేలాగే కనిపిస్తుంది. 

ఇక జులై ఒకవేళ అలా అలా గడిచిపోయినా.. ఆగష్టు నుండి థియేటర్స్ దగ్గర సినిమాల జాతర మాత్రం మొదలు కావడం పక్కాగా కనిపిస్తుంది. 

Give release dates - We will open theaters:

When can theatres in the Telugu states reopen?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ