Advertisementt

ఆ నాలుగు ఓటిటిలోనే.. డేట్స్ కూడా వచ్చేసాయి

Sun 27th Jun 2021 03:57 PM
suresh babu bad decision,venkatesh and rana films,narappa,drishyam 2,virata parvam movies,direct ott release  ఆ నాలుగు ఓటిటిలోనే.. డేట్స్ కూడా వచ్చేసాయి
Narappa, Drishyam 2, VIrata Parvam movies direct OTT release ఆ నాలుగు ఓటిటిలోనే.. డేట్స్ కూడా వచ్చేసాయి
Advertisement
Ads by CJ

తెలంగాణాలో లాక్ డౌన్ ఎత్తేసారు. థియేటర్స్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. కానీ థియేటర్స్ యాజమాన్యం థియేటర్స్ ఓపెన్ చేసేందుకు ముందుకు రావడం లేదు. కారణం కొత్త సినిమాలు లేవు, ప్రేక్షకులు వస్తారో.. రారో తెలియదు. అందుకే కొంతమంది హీరోలు ఓటిటి బాట పడుతున్నారు. థియేటర్స్ ని మెయింటింగ్ చేసే నిర్మాతే ఇప్పుడు ఓటిటి బాట పట్టడం సంచలనంగా మారింది. ఆయనెవరో కాదు.. టాలీవుడ్ బడా నిర్మాత సురేష్ బాబు. ఇప్పుడు సురేష్ బాబు కాంపౌండ్ నుండే మూడు సినిమాలు ఓటిటి బాట పట్టడం అందరికి షాకిచ్చింది. 

జులై లో థియేటర్స్ ఓపెన్ అయినా.. ప్రేక్షకుల నాడి పట్టుకోవడం కష్టము. అందుకే వెంకీ నటించిన నారప్ప, దృశ్యం 2 తో పాటుగా రానా విరాట పర్వం సినిమాలను భారీ రేట్లకి ఓటిటికి విక్రయించేశారట. ముందు నుండి అనుకున్నట్టుగానే దృశ్యం 2 ఓటిటి బాట పడితే ఇప్పుడు నారప్ప, రానా విరాట పర్వం మూవీస్ కూడా ఓటిటికి అమ్మేశారనే టాక్ నడుస్తుంది. ఇక నితిన్ మ్యాస్ట్రో ని హాట్ స్టార్ కి అమ్మేసారు. ఇప్పుడు ఈ నాలుగు సినిమాలకు ఓటిటిలో రిలీజ్ అయ్యే డేట్స్ తో పాటుగా.. ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ కూడా ఇవే అంటున్నారు. 

వెంకటేష్ - మీనా కాంబోలో జీతూ జోసెఫ్ తెరకేకించిన దృశ్యం 2 ఆగష్టు ఫస్ట్ వీక్ లో హాట్ స్టార్ లో ప్రసారమవ్వబోతుందట. 

ఇక వెంకటేష్ - ప్రియమణి జంటగా శ్రీకాంత్ అడ్డాలా రీమేక్ చేసిన నారప్ప మూవీ అమెజాన్ ప్రైమ్‌లో జూలై 24న స్ట్రీమింగ్ కాబోతుంది. 

రానా సాయి పల్లవి కాంబోలో వేణు అఉడుగుల తెరకెక్కించిన విరాట పర్వం మూవీ నెట్ ఫ్లిక్స్‌లో.. జూలై సెకండ్ వీక్ లో ప్రసారం కాబోతుంది. 

ఇక నితిన్ - నాభ నటేష్ జంటగా నటించిన మ్యాస్ట్రో మూవీ హాట్ స్టార్ లో ఆగస్టు సెకండ్ వీక్..లో ప్రసారమవుతున్నట్లుగా తెలుస్తుంది. 

Narappa, Drishyam 2, VIrata Parvam movies direct OTT release:

Suresh Babu Bad Decision with Venkatesh and Rana Films

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ