ప్రస్తుతం దేశంలో డెల్టా ప్లస్ వేరియెంట్ కంగారు పెడుతున్నా.. కరోనా వ్యాప్తి మాత్రం తగ్గుముఖం పడుతోంది. తాజాగా ఇండియా లో 46,148 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ముందు రోజుతో పోల్చితే కరోనా కేసుల్లో 7.7 శాతం తగ్గుదల కనిపించింది. ఇక తాజాగా 979 మంది ప్రాణాలు కోల్పోయారు. రెండున్నర నెలల తర్వాత ఫస్ట్ టైం వెయ్యిలోపు మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం మొత్తం కేసులు 3,02,79,331 చేరగా.3,96,730 మంది ప్రాణాలు కోల్పోయారని సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి.
అలాగే నిన్న 15,70,515 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇండియా మొత్తం మీద కేసులు 5,72,994కు చేరాయి. క్రియాశీల రేటు 1.89 శాతానికి పడిపోగా రికవరీ రేటు 96.80 శాతానికి పెరిగింది. నిన్న 58,578 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీలు 2.93 కోట్లు మార్కును దాటాయి.