కోలీవుడ్ బ్యూటిఫుల్ ప్రేమ జంట విగ్నేష్ శివన్ - నయనతార ల పెళ్లి కబురు కోసం టాలీవుడ్ నుండి కోలీవుడ్, మల్లువుడ్ వరకు ఎదురు చూస్తున్నారు. కానీ విగ్నేష్ - నయన్ పెళ్లికి ఎలాంటి తొందర లేదన్నట్టుగా విదేశాల్లో విహరిస్తున్నారు. అయితే పెళ్లి చేసుకోవడం అనేది బాగా డబ్బుతో కూడుకున్న వ్యవహారం అంటున్నాడు విగ్నేష్ శివన్. తాజాగా అభిమానులతో చిట్ చాట్ చేసిన విగ్నేష్ ని అభిమానులు పదే పదే పెళ్లి విషయం ఎత్తగా.. ఎందుకు చేసుకోను.. పెళ్లి అంటే బోలెడంత ఖర్చు పెట్టాలి. అందుకే డబ్బు కూడబెడుతున్నాను.. కరోనా పరిస్థితులు చక్కబడగానే నయన్ ని పెళ్లి చేసుకోవడం ఖాయమని చెబుతున్నాడు. ఇంకా నయనతార తో ఎలాంటి ప్లేస్ కి వెళ్లడమన్నా తనకి ఇష్టమని చెప్పిన విగ్నేష్ శివన్.. నయనతార ని చీరలో చూడడం అంటే ఇష్టమని చెబుతున్నాడు.
నయనతార చీర లో చాలా అందంగా ఉంటుంది అని, ఆమెని చీరలో చూడాలంటే ఇష్టం అని చెబుతున్నాడు మాటిమాటికి అందరూ నయనతార గురించే ప్రశ్నలు వేస్తుంటారు కదా.. మీకు కోపం రాదా అని అడిగితె.. లేదండి చాలా గర్వంగా ఉంటుంది అంటూ నయన్ పై తన ప్రేమని చాటుతున్నాడు విగ్నేష్.
ఇక నయనతార నటించిన సినిమాలన్నిటిలోకెల్లా రాజు - రాణి అంటే ఇష్టమని చెబుతున్నాడు. నయనతార ప్రతి రోజు భోజనం చేసిన తర్వాత పాత్రలని తానె స్వయంగా శుభ్రం చేస్తుందట. అంతేకాకుండా వంటకాల్లో ఘీ రైస్ చికెన్ కర్రీ అంటే నాకెంతో ఇష్టం.. అంటూ నయన్ వంటకాలను పగిడేసాడు. ఇక రజినీకాంత్ అంటే చాలా ఇష్టం.. ఆయన స్ఫూర్తి తోనే తాను సినిమాల్లోకి అడుగుపెట్టాను అంటూ బోలెడన్ని విషయాలను విగ్నేష్ శివన్ అభిమానులతో షేర్ చేసుకున్నాడు.