Advertisementt

చిరు లూసిఫర్ రీమేక్ పై బిగ్గెస్ట్ అప్ డేట్

Sat 10th Jul 2021 08:53 PM
chiru - mohan raja combo,megastar chiranjeevi,director mohan raja,lucifer remake update,chiru lucifer remake,mohan raja lucifer remake  చిరు లూసిఫర్ రీమేక్ పై బిగ్గెస్ట్  అప్ డేట్
Lucifer remake biggest update చిరు లూసిఫర్ రీమేక్ పై బిగ్గెస్ట్ అప్ డేట్
Advertisement
Ads by CJ

చిరంజీవి ప్రస్తుతం ఆచార్య షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ఆఫ్టర్ కరోనా తో ఆచార్య రెస్యూమ్ షూట్ కి రెడీ అవుతున్నారు. కొరటాల దర్శకత్వంలో ఆచార్య సినిమా ఓ 12 నుండి 15 రోజుల షూటింగ్ చిత్రీకరణతో ఫినిష్ అవుతుంది. ఆచార్య డబ్బింగ్ కార్యక్రమాలు ముగియగానే.. చిరు నెక్స్ట్ పై అందరిలో ఆసక్తి మొదలైంది. కారణం చిరంజీవి - మోహన్ రాజా కాంబోలో పూజా కార్యక్రమాలతో మొదలైన మలయాళ సూపర్ హిట్ ఫిలిం లూసిఫర్ రీమేక్ కొన్ని కారణంతో ఆగిపోయింది అనే న్యూస్ నడుస్తుంది. 

ఈ రీమేక్ ని చిరు ఆపేశారని, మోహన్ రాజా స్క్రిప్ట్ చిరు కి నచ్చలేదని ఫైనల్ గా ఈ ప్రాజెక్ట్ లోకి రీమేక్ స్పెషలిస్ట్ వినాయక్ రాబోతున్నట్టుగా వార్తలొచ్చాయి. కానీ మెగా కాంపౌండ్ ఈ విషయంలో ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. కానీ తాజాగా లూసిఫర్ రీమేక్ కి అన్ని ఏర్పాట్లు మొదలైపోయాయి. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఖరారైన ఎస్.ఎస్ థమన్ లూసిఫర్ రీమేక్ మ్యూజిక్ స్టార్ట్ చేసినట్లుగా బిగ్గెస్ట్ అప్ డేట్ ఇచ్చేసాడు. థమన్ - దర్శకుడు మోహన్ రాజా సెల్ఫీ ని పోస్ట్ చేస్తూ లూసిఫర్ వర్క్ స్టార్ట్స్ అంటూ ట్వీట్ చెయ్యడంతో లూసిఫర్ రీమేక్ ఆగలేదు.. త్వరలోనే పట్టాలెక్కబోతుంది అని ఓ క్లారిటీ వచ్చేసరికి.. మెగా ఫాన్స్ సంబరాల్లో మునిగితేలారు. 

Lucifer remake biggest update:

Chiru - Mohan raja Lucifer remake update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ