ఈమధ్యన మాత్రమే కాదు.. ఎప్పుడూ అభిమానులు అనే వాళ్ళు.. తమ ఆరాధ్య దైవాలు అభిమానించే హీరోల కోసం ఎవరెస్టు ఎక్కమన్నా ఎక్కేస్తారు. దెబ్బలు తినాలన్నా తింటారు. హీరోల పై అభిమానం చూపించే విషయం లో ఎక్కడా తగ్గరు. చాలామంది అభిమానులు తమ హీరోలు, హీరోయిన్స్ ఫంక్షన్స్ జరిగే చోట ప్రాణాలకు సైతం లెక్కచెయ్యకుండా స్టేజ్ మీదకి దూసుకొస్తూ.. బౌన్సర్లు చేతిలో దెబ్బలు తింటారు. అవకాశం కలిసొస్తే హీరోతో ఫొటోస్ దిగుతారు. తాజాగా రష్మిక అభిమాని ఒకరు ఆమె ఇంటిని గూగుల్ లో సెర్చ్ చేస్తూ 900 కిలోమీటర్లు ప్రయాణించినా రష్మిక దర్శనం దొరకలేదు.
అలాగే రామ్ చరణ్ ఫాన్స్ ముగ్గురు ఏకంగా 250 కిలో మీటర్లు నడుచుకుంటూ హైదరాబాద్ కి వచ్చేసి చరణ్ తో ఫొటోస్ దిగారు. మరి ఇదంతా అభిమానుల పిచ్చంటారో.. విపరీతమైన అభిమానమో కానీ.. వాళ్ళ వల్ల స్టార్స్ కి కూడా ఇబ్బంది తప్పడం లేదు. అయితే తన అభిమాని తనని కలుసుకోవడానికి రావడం చూసిన రష్మిక .. తాజగా ట్వీట్ చేస్తూ.. తన అభిమాని తనని కలుసుకొవడానికి వచ్చిన విషయం తెలిసి తనకి చాలా బాధ కలిగిందని.. ఏదో ఒక రోజు ఆ అభిమానిని తప్పకుండా కలుస్తాననీ, కాకపోతే ఇకపై ఎవరూ ఇలాంటి పనులు చేయవద్దని రిక్వెస్ట్ చేసింది.
పాన్ ఇండియా హీరోయిన్ గాను, బాలీవుడ్ మూవీస్, టాలీవడో మూవీస్ తో రష్మిక ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉంది. ఆమెకి అన్ని భాషల్లో అభిమానూలు పెరిగిపోతున్నారు. కానీ ఇలా అభిమానులు కష్ట పడితే వారికీ మాత్రం ఎలా సంతోషంగా ఉంటుంది. అందుకే రష్మిక ఇలా ట్వీట్ చేసింది.