Advertisementt

సామ్ ని పొగుడుతున్న నయన్ ప్రియుడు

Mon 28th Jun 2021 10:05 PM
director vignesh shivan,samantha akkineni,kaathuvaakula rendu kaadhal movie,nayan - sam,vijay sethupaty - samantha combo  సామ్ ని పొగుడుతున్న నయన్ ప్రియుడు
Vignesh Shivan praises Samantha సామ్ ని పొగుడుతున్న నయన్ ప్రియుడు
Advertisement
Ads by CJ

సమంత ఒక అద్భుతమే. ఆమె గ్లామర్ కి గ్లామర్, పెరఫార్మెన్స్ కి పెరఫార్మెన్స్.. ఇది ఆమెలోని స్పెషల్. అందుకే పెళ్లయినా సమంత కి అవకాశాల జోరు హోరు తగ్గలేదు. ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సీరీస్ తో పాన్ ఇండియా నే చుట్టేసిన సమంత గుణశేఖర్ డైరెక్షన్ లో శాకుంతలం పాన్ ఇండియా మూవీలో నటిస్తుంది. అంతేకాకుండా కోలీవుడ్ లో విగ్నేష్ శివన్ దర్శకత్వంలో నయనతార - విజయ్ సేతుపతి లతో స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది. ఆమె నటించిన కాతువాకులా రెండు కాదల్ సినిమా షూటింగ్ తాజాగా ఫినిష్ చేసుకున్న విషయం సోషల్ ఇండియాలో షేర్ చేసింది టీం. 

అయితే సమంత గురించి నయనతార లవర్, కాతువాకులా రెండు కాదల్ దర్శకుడు విగ్నేష్ శివన్ ఫాన్స్ చిట్ చాట్ లో చెప్పుకొచ్చాడు. సమంత గురించి చెప్పండి అని ఫాన్స్ అడగ్గానే సమంత.. అద్భుతమైన నటి. రూపంలోనే కాదు మనసు పరంగానూ తను అందమైన వ్యక్తి అంటూ సమంత కి కితాబునిచ్చేసాడు విగ్నేష్ శివన్. నిజమే ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ లో సమంత నటనకు అభిమానులే కాదు.. పలు భాషా ప్రేక్షకులు కూడా సమంత టెర్రరిస్ట్ నటన గురించి తెగ పొగిడేస్తున్నారు. ఆ సీరీస్ లో సమంత పెరఫార్మెన్సు కి విమర్శకుల సైతం పొగిడేశారు. 

ఇక అభిమానుల చిట్ చాట్ లో విగ్నేష్ కి తెలుగులో మహేష్, అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టమని చెప్పాడు. 

Vignesh Shivan praises Samantha:

Director Vignesh Shivan praises Samantha

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ