Advertisementt

రాధేశ్యామ్ కి అదిరిపోయే బిజినెస్

Tue 29th Jun 2021 02:30 PM
prabhas - pooja hegde combo,radhe shyam pan india movie,prabhas - pooja hegde,radhe shyam non theatrical price,record breaking price  రాధేశ్యామ్ కి అదిరిపోయే బిజినెస్
Radhe Shyam Non Theatrical Price Record Breaking Price రాధేశ్యామ్ కి అదిరిపోయే బిజినెస్
Advertisement
Ads by CJ

పాన్  ఇండియా స్టార్ ప్రభాస్ రేంజ్, క్రేజ్ మాటల్లో చెప్పలేనంత ఉంది. వరల్డ్ వైడ్ గా ప్రభాస్ క్రేజ్ బాహుబలితో పాకిపోయింది. ఆ తర్వాత సాహో తోనూ తన ప్రభంజనాన్ని చాటిన ప్రభాస్ ఆ తర్వాత ఎక్కడా తగ్గడం లేదు. రాధేశ్యామ్ అంటూ లవ్ ఎంటెర్టైనెర్ చేసిన ప్రభాస్.. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఈమధ్యనే మొదలైన రెస్యూమ్ షూట్ లో పాట చిత్రీకరణ పూర్తయితే.. రాధేశ్యామ్ షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది. అయితే ఇప్పుడు రాధేశ్యాం నాన్ థియేట్రికల్ హక్కులు భారీ రేటుకు అమ్ముడుపోయాయని తెలుస్తుంది. 

కరోనా పాండమిక్ సిట్యువేషన్ లో ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాకి భారీ ఓటిటి ఆఫర్స్ వచ్చాయి. కానీ సినిమాని థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తామని మేకర్స్ ఓటిటి ఆఫర్స్ కి ఒప్పుకోలేదు. ఇక తాజాగా రాధేశ్యామ్ నాన్ థియేట్రికల్ హక్కులు 250 కోట్లకి అమ్ముడుపోయాయట. మంచి రేటు రావడంతో రాధేశ్యామ్ నిర్మాతలు అన్ని ఏరియాలను అమ్మేశారని తెలుస్తుంది. ఇక బాహుబలి, సాహో సినిమాలకన్నా రాధేశ్యామ్ థియేట్రికల్ రైట్స్ కి భారీ ధర పలికింది అంటున్నారు. మరి ప్రభాస్ లుక్స్ విషయంలో కంటెంట్ విషయంలో కాస్త తేడా కొడుతున్న రాధేశ్యామ్ రేంజ్ ఇలా ఉంటె.. ప్రభాస్ సలార్, ఆదిపురుష్ రేంజ్ ఇంకెంత ఉండాలి అంటున్నారు ప్రభాస్ ఫాన్స్. 

Radhe Shyam Non Theatrical Price Record Breaking Price:

Prabhas - Pooja Hegde Radhe Shyam Non Theatrical Price Record Breaking Price

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ