Advertisementt

ఆర్.ఆర్.ఆర్ పోస్టర్ తో పోలీస్ పబ్లిసిటీ

Tue 29th Jun 2021 05:39 PM
cyberabad police,using rrr movie poster,helmet awareness  ఆర్.ఆర్.ఆర్ పోస్టర్ తో పోలీస్ పబ్లిసిటీ
RRR poster use for helmet awareness by Cyberabad Traffic police ఆర్.ఆర్.ఆర్ పోస్టర్ తో పోలీస్ పబ్లిసిటీ
Advertisement
Ads by CJ

ఈ రోజు ఉదయం ఆర్.ఆర్.ఆర్ నుండి భారీ అప్ డేట్ వచ్చింది. కేవలం రెండు పాటల చిత్రీకరణతో ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ పూర్తి కాబోతుంది అని, హీరోలు డబ్బింగ్ చెప్పడానికి రెడీ అంటూ, అనుకున్న డేట్ కి అంటే అక్టోబర్ 13 న సినిమా థియేటర్స్ లో రిలీజ్ అంటూ బిగ్గెస్ట్ అప్ డేట్ ఇస్తూనే ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ లు కొమరం భీం - అల్లూరి గెటప్స్ లో బైక్ మీద వెళుతున్న పోస్టర్ ని రిలీజ్ చేసారు. ఎన్టీఆర్ బైక్ డ్రైవ్ చేస్తుండగా.. రామ్ చరణ్ వెనకగా కూర్చున్న పోస్టర్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. 

అయితే ఇప్పుడు ఆ పోస్టర్ ని సైబరాబాద్ పోలీస్ లు పబ్లీసిటికి వాడేసుకున్నారు. హెల్మెట్ లేని ప్రయాణం నేరము, ప్రమాదం అంటూ ఎంత అవగాహన కలిపించినా చాలామంది హెల్మెట్ లేని ప్రయాణంతో ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే తాజాగా విడుదలైన ఆర్.ఆర్.ఆర్ పోస్టర్ లో చరణ్ - ఎన్టీఆర్ లు బైక్ పైన హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతున్నారు. 

ఆ పోస్టర్ లో ఎన్టీఆర్ కి రామ్ చరణ్ కి హెల్మెట్స్ జోడించి వదిలారు. ఇప్పుడు సరిగ్గా ఉంది. హెల్మెట్‌ ధరించండి. సురక్షితంగా ఉండండి అంటూ ఆ ఫోటో కి క్యాప్షన్ పెట్టారు. అది చూసిన ఆర్ ఆర్ ఆర్ టీం.. ఇప్పటికి సరిగా లేదు.. ఆ బైక్ కి నెంబర్ ప్లేట్ మిస్ అయ్యింది అంటూ కామెడీ చేసేసారు. 

RRR poster use for helmet awareness by Cyberabad Traffic police:

Cyberabad Police Using RRR Movie Poster For Awareness

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ