Advertisementt

అప్పుడు బాబు భజన - ఇప్పుడు ఈమె భజన

Wed 30th Jun 2021 09:05 AM
jabardasth comedy show,jabardasth comedian,jabardasth secrets,jabardasth judge roja and nagababu,nagababu,roja  అప్పుడు బాబు భజన - ఇప్పుడు ఈమె భజన
Jabardasth secrets out అప్పుడు బాబు భజన - ఇప్పుడు ఈమె భజన
Advertisement
Ads by CJ

జబర్దస్త్ సీక్రెట్స్ అన్ని ఈమధ్యన యూట్యూబ్ ఛానల్స్ కి ఎక్కుతున్నాయి. ఒకప్పుడు జబర్దస్త్ కమెడియన్స్ ద్వారా కానీ, దేని ద్వారానో కానీ జబర్దస్త్ విషయాలేవీ బయటికి వచ్చేవి కాదు. కానీ నాగబాబు జబర్దస్త్ నుండి బయటికి వచ్చేసాక.. చాలామంది కమెడియన్స్ ఆయనతో వెళ్ళిపోయి.. జబర్దస్త్ విషయాలను చాలా వరకు లీక్ చేసేసారు. ఈమధ్యన యూట్యూబ్ ఛానల్స్ ఎక్కువయ్యాక జబర్దస్త్ కమెడియన్స్ ఎక్కువగా యూట్యూబ్ ఇంటర్వూస్ లో జబర్దస్త్ సీక్రెట్స్ అన్ని రివీల్ చేసేస్తున్నారు. తాజాగా ఓ కమెడియన్ జబర్దస్త్ సీక్రెట్స్ చాలా వాటిని రివీల్ చేసేసాడు.

గతంలో నాగబాబు కన్నా రోజా గారికే ఎక్కువ ప్రాముఖ్యత జబర్దస్త్ లో ఉండేది అనుకునేవారని.. మల్లెమాల శ్యాం ప్రసాద్ రెడ్డి, రోజా రెడ్డి, ఇద్దరూ రెడ్డి రెడ్డి కాబట్టి రోజాకి ఎక్కువ ఇంపార్టన్స్ జబర్దస్త్ లో ఉంటుంది అనుకునేవారు. కానీ నాగుబాబు గారికే ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. రోజా గారికి నాగబాబు గారికి ఉన్న ఇంపోర్టన్స్ లేదని తేల్చేసాడు. అంతేకాదు నాగుబాబు ఫైనల్ గా ఎవరికీ 10 ఇవ్వాలో, స్కిట్ టాప్ ఎవరికి ఇవ్వాలో డిసైడ్ చేస్తారని, దానికి రోజా గారు తలూపుతారని.. నాగబాబు గారు వెళ్లిపోయాకే ఆమెకి అక్కడ ప్రధాన్యత పెరిగింది అని చెప్పాడు.

ఇక నాగబాబు గారు జబర్దస్త్ లో ఉన్నప్పుడు నాగబాబు గారి భజన చేసే కమెడియన్స్ ఇప్పుడు రోజా గారి భజన చేస్తున్నారంటూ జబర్దస్త్ సీక్రెట్స్ ని రివీల్ చేసేసాడు. అంతేకాకుండా స్కిట్స్ అన్ని అయ్యాక డైరెక్టర్ వచ్చి జేడ్జ్ లని ఏ స్కిట్ బావుంది అని అడిగి ఎవరికీ 10 ఇవ్వాలో డిస్కర్స్ చేసుకుంటారని అప్పుడే పెరఫార్మెర్ అఫ్ ద డే ఇస్తారంటూ జబర్దస్త్ టాప్ సీక్రెట్స్ ని లీక్ చేసాడు. 

Jabardasth secrets out:

Jabardasth comedian revealed Jabardasth secrets

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ