తెలుగులో పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ వంటి స్టార్స్ తో నటించినా పెద్దగా సక్సెస్ దక్కక, ఇక్కడ అవకాశాలు కూడా తగ్గిపోవడంతో.. ఇతర భాషల్లో సినిమాలు చేస్తున్న ప్రణీత్ రీసెంట్ గా పెళ్లి చేసుకుని అందరికి షాకిచ్చింది. పెళ్లి చేసుకుని ఆ ఫొటోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. మీకు చెప్పి పెళ్లి చేసుకొన్నందుకు సారి అని కూడా చెప్పింది.
ఇక సౌత్ లో పెద్దగా అవకాశాలు లేని ప్రణీతకి బాలీవుడ్ లో ఓ మూవీ చేసే అవకాశం దక్కింది. అక్కడ ఆమె బాలీవుడ్ డైరెక్టర్ ప్రియదర్శన్ దర్శకత్వంలో పరేష్ రావల్, శిల్ప శెట్టి కలయికలో తెరకెక్కిన హంగామా 2 లో నటించింది. ప్రస్తుతం థియేటర్స్ క్లోజ్ అవడంతో.. చాలా సినిమాలు ఓటిటిబాట పడుతున్నట్లుగా ప్రణీత సుభాష్ హంగామా 1 కూడా ఓటిటి తలుపు తట్టింది. జులై 23 న హుంగామ 2 దిస్ని + హాట్ స్టార్ లో రిలీజ్ కాబోతున్నట్టుగా ప్రకటించారు. జులై 23 న హంగామా 2 ప్రీమియర్స్ అంటూ ప్రకటించారు.