బాలకృష్ణ - బోయపాటి కాంబో లో రాబోతున్న అఖండ మూవీ చివరి షెడ్యూల్ చిత్రీకరణకు సన్నద్ధం అవడమే కాదు.. అఖండ మూవీ ని వచ్చే వినాయక చవితికి రిలీజ్ చేసే యోచనలో చిత్ర బృందం ఉంది అంటూ ప్రచారం జరుగుతుంది. కానీ అఖండ టీం మాత్రం ఇంతవరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా అఖండ దర్శకుడు బోయపాటి తిరుమల వెళ్లి శ్రీవారి దర్శించుకున్నారు. అక్కడ మీడియా తో మట్లాడుతూ.. అఖండ చివరి షెడ్యూల్ మొదలు కాబోతుంది.
అఖండ క్లైమాక్స్ తో పాటుగా ఓ సాంగ్ చిత్రీకరణ, ఇంకా చిన్న చిన్న పనులు అఖండ కి మిగిలి ఉన్నాయి, ప్రస్తుతం అఖండ క్లైమాక్స్ షూట్ కోసం లొకేషన్స్ వేటలో ఉన్నామని, అందులో భాగంగానే చిత్తూరు, కడప జిల్లాలో చారిత్రాత్మక స్థలాలను పరిశీలిస్తున్నామని చెప్పిన బోయపాటి అఖండ రిలీజ్ విషయం మాత్రం ఇప్పడే చెప్పలేమని షాకిచ్చాడు. ఎందుకంటే కరోనా థర్డ్ వేవ్ అంటున్నారు. ప్రేక్షకులు ఎంతవరకు థియేటర్స్ కి వస్తారో చెప్పలేము. ప్రేక్షకులు అందరూ సేఫ్ అనుకున్నప్పుడే అఖండ రిలీజ్ ని ప్లాన్ చేస్తామని సినిమా రిలీజ్ పై జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టాడు బోయపాటి.