పాన్ ఇండియా హీరోయిన్ పూజ హెగ్డే సెకండ్ వేవ్ కంట్రోల్ కాగానే తాను నటిస్తున్న సినిమా షూటింగ్స్ కోసం సిద్ధమైపోయింది. లాక్ డౌన్ లో ఇంట్లోనే ఫ్యామిలీ తో హాయిగా గడిపేసిన పూజ హెగ్డే రాధేశ్యామ్ రెస్యూమ్ షూట్ ని ఫినిష్ చేసేసింది. ప్రభాస్ గత వారమే రాధేశ్యామ్ షూట్ లో జాయిన్ అవగా.. పూజ హెగ్డే కూడా జాయిన్ అయ్యింది. ఇక తాజాగా పూజ హెగ్డే తన రోల్ చిత్రీకరణ పూర్తి చేసేసుకుని తన ఇతర సినిమా షూటింగ్స్ కోసం వెళ్ళిపోయింది.
ఇక రాధేశ్యామ్ లో పూజ హెగ్డే - విక్రమాదిత్య ప్రభాస్ కి మధ్యన ఉండే ప్రేమ కథ ఎమోషనల్ గా ఉంటుంది అని.. సినిమా క్లయిమాక్స్ విషాదాంతగా ముగియబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. క్లైమాక్స్ లో ప్రేక్షకులు కంట తడి పెట్టడం ఖాయమని.. పూజ హెగ్డే ప్రేరరణ పాత్ర చనిపోతుంది అని.. ఆ సీన్స్ సినిమాకే మెయిన్ హైలెట్ అంటున్నారు. ఇక ప్రస్తుతం పూజ హెగ్దే రాధేశ్యామ్ షూటింగ్ పూర్తి చేసేసి.. ముంబై వెళ్ళిపోయింది. అక్కడ బాలీవుడ్ ఫిలిమ్స్, అలాగే తమిళ్ బీస్ట్ మూవీ కోసం పూజ రెడీ అవ్వబోతుంది.