కన్నడ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా రాబోతున్న కెజిఎఫ్ 2 పై భారీ అంచనాలున్నాయి. ఈ నెల 16 నే రాపేక్షకుల ముందుకు రావాల్సిన కెజిఎఫ్ మూవీ కరోనా కారణంగా వాయిదా పడినట్లే కనిపిస్తుంది. మళ్ళీ ఎప్పుడు రిలీజ్ అనేది డేట్ ఇంకా ఇవ్వలేదు. అయితే తాజాగా కెజిఎఫ్ ఆడియో రైట్స్ భారీ ధరకు అమ్ముడు పోయాయి.
ఆడియో రంగంలో పెను సంచలనం సృష్టిస్తున్న లహరి టి సిరీస్ కంపెనీ కెజిఎఫ్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టును సొంతం చేసుకుంది. ఇండియా వైడ్ గా ఆసక్తి ని రేకిస్తున్న వండర్ మూవీ కె జి ఎఫ్ 2 చిత్ర ఆడియో రైట్స్ సౌత్ ఇండియా హక్కులు సొంతం చేసుకున్నట్లు సిఈఓ మనోహర్ నాయుడు తెలిపారు. కేజీఎఫ్-2 మూవీ దక్షిణాది భాషల ఆడియో హక్కులు ఏకంగా రూ.7.2 కోట్లకు అమ్ముడయ్యాయి. లహరి మ్యూజిక్, టీ సిరీస్ కలిసి ఈ హక్కులను కొనుగోలు చేశాయి.